Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే రైతు బంధు జమ.. బ్యాంకు బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి!

Telangana Rythu Bandhu:తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి రైతుబంధు నిధులు జమ చేయనుంది ప్రభుత్వం. ఈ ఏడాది యాసంగి సీజన్​కు సంబంధించి రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.

Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే రైతు బంధు జమ.. బ్యాంకు బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి!
Rythu Bandhu

Updated on: Dec 28, 2021 | 7:28 AM

Telangana Rythu Bandhu: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి రైతుబంధు నిధులు జమ చేయనుంది ప్రభుత్వం. ఈ ఏడాది యాసంగి సీజన్​కు సంబంధించి రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏడు విడతల్లో సుమారు 44 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని మంత్రి సింగిరెడ్డి తెలిపారు. ఈ సీజన్‌తో కలుపుకుని మొత్తం 50 వేల కోట్ల రూపాయలు రైతుబంధు పథకం కింద, అన్నదాతల ఖాతాల్లో జమ చేయడం పూర్తవుతోందని మంత్రి తెలిపారు.

మరోవైపు, డిసెంబరు 10 నాటికి ధరణి పోర్టల్‌లో పట్టాదారులు, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులు, రైతుబంధు పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులని ప్రకటించారు అధికారులు. ఈ యాసంగి సీజన్‌లో 66 లక్షల మంది రైతులుకు సంబంధించిన 152 లక్షల ఎకరాలకు, 7వేల 645 కోట్ల రూపాయలు జమ చేయడానికి సన్నద్ధమైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ఎకరా నుంచి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగానే, ఆరోహణ క్రమంలో నిధులు జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతుబంధు పథకం గొప్పదనాన్ని వివరించారు మంత్రి. ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాల్లో రైతుబంధు ఒకటిగా, 2018 నవంబరులో రోమ్‌ నగరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో AFAO ప్రశంసించిందని వివరించారు మంత్రి నిరంజన్‌రెడ్డి. రైతుబంధు నిధుల జమ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే, స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి సింగిరెడ్డి సూచించారు.

Read Also…  PM Modi: ఇవాళ యూపీకి ప్రధాని మోడీ.. కాన్పూర్ ఐఐటి స్నాతకోత్సవంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరు