Telangana: రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న ఎండలు.. హాఫ్ డే స్కూల్స్‌ను ప్రకటించిన విద్యాశాఖ

| Edited By: Ravi Kiran

Mar 14, 2022 | 1:43 PM

Telangana: వేసవి కాలం(Summer Season) వచ్చేసింది. ఓ వైపు ఎండలు మండిస్తున్నాయి. మరోవైపు పరీక్షల సందడి మొదలు కానున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులను(Half Day Schools) నిర్వహించనున్నామని..

Telangana: రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న ఎండలు.. హాఫ్ డే స్కూల్స్‌ను ప్రకటించిన విద్యాశాఖ
Half Day Schools In Telanga
Follow us on

Telangana: వేసవి కాలం(Summer Season) వచ్చేసింది. ఓ వైపు ఎండలు మండిస్తున్నాయి. మరోవైపు పరీక్షల సందడి మొదలు కానున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులను(Half Day Schools) నిర్వహించనున్నామని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 వ‌ర‌కు బ‌డులు నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.  ఈ ఒంటిపూట బడులను ఏప్రిల్ 23 వరకూ నిర్వహించనున్నారు. అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు పని చేస్తాయి.

హాఫ్ డే స్కూల్ టైమింగ్స్, టైమ్ టేబుల్, పీరియడ్స్ , ఇతర వివరాలను విద్యాశాఖ వెబ్‌సైట్ లో పెట్టనున్నామని విద్యాశాఖ తెలిపింది. హాఫ్ డే స్కూల్, హాలీ డేస్ కు సంబంధించిన వివరాలను అన్ని విద్యాసంస్థలకు అందిస్తామని అధికారులు చెప్పారు.

మరోవైపు తెలంగాణాలో టెన్స్ పరీక్షల షెడ్యూల్ ను ఎస్‌ఎస్‌సీ బోర్డు ఇప్పటికే రిలీజ్ చేసింది. మే 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.  ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ కోర్సులకు మే 18 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read:

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. ఆదివారం కిలో వెండిపై ఎంత పెరిగిందంటే..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..