AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారబోతున్న భాగ్యనగరం.. ‘మూసీ’ నదికి అదిరిపోయే కొత్త లుక్.. ప్లాన్ చూస్తే షాకే!

హైదరాబాద్ మహానగర ముఖచిత్రాన్ని మార్చేలా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. భవిష్యత్తు సవాళ్లు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఏకంగా లక్షన్నర క్యూసెక్కుల గరిష్ఠ వరద ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా మూసీ నది డిజైన్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు తొలి దశ పనుల అంచనాలు, నిధుల సమీకరణ, అమలు విధానంతో కూడిన సమగ్ర నివేదికను పురపాలక శాఖ ఇటీవల మంత్రివర్గానికి సమర్పించింది.

మారబోతున్న భాగ్యనగరం.. 'మూసీ' నదికి అదిరిపోయే కొత్త లుక్.. ప్లాన్ చూస్తే షాకే!
Musi River Rejuvenation Project
Prabhakar M
| Edited By: |

Updated on: Jul 03, 2026 | 1:45 PM

Share

హైదరాబాద్ మహానగర ముఖచిత్రాన్ని మార్చేలా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. భవిష్యత్తు సవాళ్లు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఏకంగా లక్షన్నర క్యూసెక్కుల గరిష్ఠ వరద ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా మూసీ నది డిజైన్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు తొలి దశ పనుల అంచనాలు, నిధుల సమీకరణ, అమలు విధానంతో కూడిన సమగ్ర నివేదికను పురపాలక శాఖ ఇటీవల మంత్రివర్గానికి సమర్పించింది.

తొలి దశకు రూ.7,345 కోట్లు

మూసీ పునరుజ్జీవన తొలి దశ పనుల కోసం ప్రాథమికంగా రూ.7,345 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించారు. అయితే ఇందులో భూసేకరణకు అయ్యే ఖర్చులను చేర్చలేదు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో సింహభాగాన్ని, అంటే దాదాపు రూ.4,500 కోట్లను అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అయిన ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) నుంచి రుణ రూపంలో సమీకరించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మిగిలిన రూ.2,845 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండేళ్ల బడ్జెట్‌లో విడతల వారీగా విడుదల చేయాలని ప్రతిపాదించింది. ఒకవేళ నిధుల కొరత ఏర్పడితే, మూసీ అభివృద్ధి సంస్థ పరిధిలోని ప్రభుత్వ భూముల విక్రయం లేదా లీజింగ్ ద్వారా సమీకరించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు.

రెండు దశల్లో 55 కిలోమీటర్ల అభివృద్ధి

మొత్తం 55 కిలోమీటర్ల మేర సాగే ఈ మూసీ కారిడార్ అభివృద్ధిని ప్రభుత్వం రెండు దశల్లో పూర్తి చేయనుంది. ఇందులో భాగంగా తొలి దశలో అత్యంత కీలకమైన 21 కిలోమీటర్ల మేర పనులను ప్రారంభించనున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 9.2 కిలోమీటర్లు, అలాగే ఉస్మాన్‌సాగర్, గండిపేట నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 11.8 కిలోమీటర్ల పరిధిని మొదటి విడతలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు.

వందేళ్ల వరదపై శాస్త్రీయ అధ్యయనం!

భవిష్యత్తులో హైదరాబాద్‌కు వరద ముప్పు లేకుండా చూసేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సర్వే చేయించింది. వందేళ్లలో ఒకసారి వచ్చే అత్యంత భారీ వరద పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు దిగువకు వచ్చే గరిష్ఠ ప్రవాహాలపై రూర్కీలోని ప్రసిద్ధ ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ’ (NIH) అభిప్రాయాలను కూడా సేకరించారు. బాపూఘాట్ వద్ద గరిష్ఠంగా 1.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చడంతో, ఆ నీరంతా నగరంలోకి ముంచెత్తకుండా సాఫీగా సాగిపోయేలా నది వెడల్పు, లోతు, బ్యూటిఫికేషన్ డిజైన్లను లాక్ చేశారు.

ప్రత్యేక విభాగానికి ఆమోదం

ఈ భారీ ప్రాజెక్టును ఈపీసీ (Engineering, Procurement, and Construction) పద్ధతిలో అంతర్జాతీయ ఏజెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పనుల పర్యవేక్షణ, వేగవంతమైన అనుమతుల కోసం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో 147 ప్రత్యేక పోస్టుల మంజూరుకు కూడా ఆమోదం లభించింది. పురపాలక, రెవెన్యూ, అటవీ, పోలీసు, నీటిపారుదల శాఖల అధికారులను డిప్యుటేషన్‌పై నియమించి, ఈ ప్రత్యేక విభాగాన్ని బలోపేతం చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us