Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 19 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 19 మంది డీ ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశాలు..

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 19 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ

Updated on: Aug 26, 2021 | 10:34 AM

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 19 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోలో పోస్టింగ్‌ కోసం వెయింగ్‌లో ఉన్న జి. హనుమంతరావును కూకట్‌పల్లి ట్రాఫిక్‌ ఏసీపీగా బదిలీ చేశారు. ఇప్పటి వరకు అక్కడ ట్రాఫిక్‌ ఏసీపీగా ఉన్న ఏ. చంద్రశేఖర్‌ను కూకట్‌పల్లి ఏసీపీగా నియమించారు. అలాగే కూకట్‌పల్లి ఏసీపీగా ఉన్న బీ సురేందర్‌రావును సైబరాబాద్‌ ఏసీపీ, ఎస్‌బీగా బదిలీ చేశారు.

ఇబ్రహింపట్నం ఏసీపీగా ఉన్న యాదగిరి రెడ్డిని రాచకొండ సీపీ ఆఫీస్‌లో, జగిత్యాల ఎస్డీపీఓగా ఉన్న పి. వెంకటరణ, చౌటుప్పల్‌ ఏసీపీగా ఉన్న పీ సత్తయ్య, గద్వాల డీఎస్పీ ఏ యాదగిరిని చీఫ్‌ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. అలాగే ఏ. అనిల్‌ కుమార్‌- కాగజ్‌నగర్‌ ఎస్డీపీఓగా, బాల కృష్ణా రెడ్డి- ఇబ్రహింపట్నం ఏసీపీగా, మాదాత రమేష్‌- గజ్వేల్‌ ఏసీపీగా, ఆర్‌ శ్రీనివాస్‌- ఆసిఫాబాద్‌ ఎస్డీపీఓగా, రత్నాపురం ప్రకాశ్‌- జగిత్యాల ఎస్డీపీఓ, ఆర్‌ సతీశ్‌ కుమార్‌- గోషామహల్‌ ఏసీపీగా,ఎన్‌ ఉదయ్‌ రెడ్డి- చౌటుప్పల్‌ ఏసీపీగా, సాయి రెడ్డి వెంకట్‌ రెడ్డి- భువనగిరి ఏసీపీగా, వాసాల సత్తయ్య- హుస్నాబాద్‌ ఏసీపీగా, ఎన్సీ రంగస్వామి- గద్వాల్‌ డీఎస్పీగా,కే సైదులు- మెదక్‌ ఎస్డీపీఓగా నియమించింది ప్రభుత్వం.

డీజీపీ హోదా:

కాగా, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఉమేష్ షరాఫ్‌, గోవింద్ సింగ్, రవిగుప్తాకు డీజీపీ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంజనీ కుమార్ హైదరాబాద్ సీపీగా డీజీపీ హోదాలో కొనసాగుతున్నారు. గతంలోనే ఈ పోస్టును మహేందర్ రెడ్డి సీపీగా ఉన్నప్పుడు అదనపు డీజీ నుంచి డీజీపీ స్థాయికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఐపీఎస్ రవిగుప్తా హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. గోవింద్ సింగ్ సీఐడీ డీజీగా పనిచేస్తున్నారు. ఉమేశ్ షరాఫ్ పోలీస్ శాఖ సంక్షేమ విభాగం అదనపు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఇప్పటి వరకు అదనపు డీజీ హోదాలో ఉన్నారు.

ఇవీ కూడా చదవండి:

Pocharam Srinivas Reddy: సిక్స్‌ కొట్టిన అసెంబ్లీ స్పీకర్‌.. చిచ్చర పిడుగులతో బ్యాటింగ్‌.. పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన పోచారం..

Health Insurance: మహిళలకు ఆరోగ్య బీమా పాలసీ.. ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!