Telangana: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..

Telangana Contract Employees: రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల

Telangana: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..
Cm Kcr

Updated on: Mar 29, 2022 | 5:08 PM

Telangana Contract Employees: రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్ ప్రక్రియ‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. 2016లో జారీ చేసిన జీవో 16 ప్రకారం అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు పంపాలని ఆయా శాఖలను ఆర్థిక శాఖ కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మంజూరైన పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపిన ఆర్థిక శాఖ.. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని కోరింది. కాగా, రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ అర్హతల ఆధారంగా రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన మేరకు రాష్ట్రంలో ఉన్న 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి కీలక ప్రకటన జారీ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను కూడా ప్రారంభించింది ప్రభుత్వం.

Also read:

Instagram Feature: యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఇకపై వాయిస్‌ రూపంలో..

SRH vs RR Playing XI IPL 2022: తొలిపోరుకు సిద్ధమైన మాజీ ఛాంపియన్లు.. రాజస్థాన్, హైదరాబాద్ ప్లేయింగ్‌ XI ఎలా ఉండనుందంటే?

Street Food India: ఓ వైపు ఉద్యోగం.. మరోవైపు సైకిల్‌పై మోమోస్ అమ్మకం.. నువ్వు సూపర్‌ గురూ అంటూ నెటిజన్ల ప్రశంసలు