Telangana: అప్పటి వరకు కాలేజీలు తెరిచేదే లే.. ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ కీలక ప్రకటన

గతకొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. బకాయిలు చెల్లించాలని గతంలో ప్రైవేట్‌ కాలేజీలు బంద్‌కు పిలుపునివ్వగా ప్రభుత్వం వారితో చర్చలు జరిపి సమస్యను సద్దుమణిగించింది. అయితే ప్రభుత్వ ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని.. మొత్తం బకాయిల్లో 50 శాతం కచ్చితంగా చెల్లించాలని మరోసారి ప్రైవేట్‌ కాలేజ్ యాజమాన్యలు సమ్మెకు దిగాయి.

Telangana: అప్పటి వరకు కాలేజీలు తెరిచేదే లే.. ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ కీలక ప్రకటన
Association Of Private Colleges

Edited By: Anand T

Updated on: Nov 05, 2025 | 3:53 PM

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. 2000 వేలకు పైగా వృత్తివిద్యా కాలేజీలతో పాటు పీజీ, డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. కీలకమైన సెమిస్టర్ పరీక్షలను సైతం మెజార్టీ కాలేజీలు బైకాట్ చేశాయి. బుధవారం ముడోరోజు సైతం విజయవంతంగా సాగిన బంద్ పై ఉన్నత విద్య సంస్థల సమాఖ్య స్పందించి.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్లో యాభై శాతం నిధులు ఇస్తే కానీ సమ్మె విరమించేది లేదంటూ స్పష్టం చేశాయి. మంగళవారం ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లామని ఆయనా సర్కారు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదని తెలిపింది. కార్యచరణలో భాగంగా ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో దాదాపు 30 వేల మందితో అధ్యాపక సాంత్వన సభ నిర్వహిస్తున్నామంటూ కాలేజీ యాజమాన్యాలు పోస్టర్ విడుదల చేశాయి.

ఫీజు సంస్కరణల కమిటీపై అభ్యంతరం..

ఫీజు రీయింబర్స్ మెంట్ సంస్కరణల కోసం ప్రభుత్వం పదిహేను మందితో వేసిన కమిటీపై ఉన్నత విద్య సంస్థల సమాఖ్య సంతోషం అంటూనే అందులోని ఇద్దరు సభ్యులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధం లేని వ్యక్తులను కమిటీలో వేయడం వల్ల కాలయాపన అవుతుందని. ఆ ఇద్దరిని తొలగించాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ తెలిపింది. టెక్నికల్ ఎడ్యూకేషన్ కమిషనర్ దేవసేనపై ఉన్నత విద్య సంస్థల సమాఖ్య ఫైర్ అయింది. బంద్ పాటిస్తున్న కాలేజీలను దేవసేన బెదిరిస్తున్నారని.. ఆమెను విద్యాశాఖ నుంచి బదిలీ చేయాలని కోరారు. దేవసేన యూజ్ లెస్ కాలేజస్ అంటూ నోరుజారరని ఫతి చైర్మన్ రమేశ్ బాబు మండిపడ్డారు.

దాదాపు 2వేలకు పైగా కాలేజీలకు రావాల్సిన 10 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్లో యాభై శాతం అంటే 5వేల కోట్లు ఇవ్వాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పటివరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశాయి. 10 లక్షల మంది విద్యార్థులతో ఈ నెల 11న నగర శివారులో చలో హైదరాబాద్ పేరుతో భారీ బహిరంగ సభతో నిరసన తెలియజేస్తామని ఫతి తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి