తెలంగాణ ఎక్సైజ్ దాడులు: ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!

తెలంగాణ ఎక్సైజ్ STF రెండు వేర్వేరు దాడులలో భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకుంది. పహాడ్ షరీఫ్‌లో 141 గోవా, ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు, శంషాబాద్ గండిగూడలో 4 లీటర్ల మద్యం, బీర్ స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయం గుండా అక్రమంగా తరలిస్తున్న నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) వలన రాష్ట్ర ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అక్రమ ముఠాలపై ఎక్సైజ్ బృందాలు నిఘా పెంచాయి.

తెలంగాణ ఎక్సైజ్ దాడులు: ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
Ndpl Seizures In Telangana

Edited By:

Updated on: Feb 26, 2026 | 10:13 PM

తెలంగాణ ఎక్సైజ్ STF బృందం పహాడ్ షరీఫ్‌లో 141 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. శంషాబాద్ గండిగూడలో మరో దాడిలో 4.14 లీటర్ల మద్యం, 1.95 లీటర్ల బీర్ స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా గోవా తో పాటు ఇతర రాష్ట్రాలు మరియు విదేశాల నుంచి తీసుకొచ్చిన మద్యం బాటిళ్లు.ఎక్సైజ్ STF టీమ్ లీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వస్తున్న వాహనాలపై తనిఖీలు నిర్వహించారు.

ఈ దాడిలో వివిధ కార్లలో దాచిన 141 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. ఇది ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకువచ్చిన నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL).శంషాబాద్ గండిగూడ ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుభాష్ చందర్ నేతృత్వంలో గండిగూడ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. 4.14 లీటర్ల మద్యం, 1.95 లీటర్ల బీర్ స్వాధీనం చేసి, శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.

ఈ ఘటనలు రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగిస్తున్నయి.ఇతర రాష్ట్రాలు/విదేశీ మద్యం రవాణా ఎయిర్ పోర్టు గుండా జరుగుతుంది.గోవా, ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి తక్కువ ధరల మద్యాన్ని విమానాల ద్వారా లేదా రోడ్డు మార్గాల ద్వారా తెలంగాణకు తీసుకువస్తున్నారు. ఎయిర్పోర్టు నుంచి కార్లలో నగరానికి తరలిస్తూ విక్రయిస్తున్న ముఠాలపై ప్రత్యేక టీమ్‌లు పరిశీలిస్తున్నాయి. 2025లో 644 కేసులు నమోదై, 8201 లీటర్ల మద్యం పట్టివేసి 381 మందిని అరెస్ట్ చేశారు; 2024లో 955 కేసులు, 12807 లీటర్లు స్వాధీనం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us