Telangana: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్న తుమ్మల.. కలకలం రేపుతున్న ఆ ఎమ్మెల్యేతో భేటీ..

|

Nov 22, 2022 | 6:00 AM

టీఆర్‌ఎస్‌లో మాజీ మంత్రి, ఓ ఎమ్మెల్యే మీటింగ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ, ఆ మాజీ మంత్రి ఎవరు? ఆ ఎమ్మెల్యే ఎవరు? వీళ్లిద్దరూ అసలెందుకు కలిశారు? వివరాలు..

Telangana: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్న తుమ్మల.. కలకలం రేపుతున్న ఆ ఎమ్మెల్యేతో భేటీ..
Thummala Nageshwar Rao
Follow us on

టీఆర్‌ఎస్‌లో మాజీ మంత్రి, ఓ ఎమ్మెల్యే మీటింగ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ, ఆ మాజీ మంత్రి ఎవరు? ఆ ఎమ్మెల్యే ఎవరు? వీళ్లిద్దరూ అసలెందుకు కలిశారు? వివరాలు ఇప్పుడు చూద్దాం.. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మీటింగ్‌ సంచలనం రేపుతోంది. వీళ్లిద్దరి భేటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌ నుంచి దమ్మపేట వెళ్తూ మార్గమధ్యలో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావును కలిశారు తుమ్మల. మణుగూరులోని రేగా క్యాంప్‌ కార్యాలయాలకెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు ఇరవై నిమిషాలపాటు వీళ్లిద్దరి మీటింగ్‌ జరిగింది.

రేగా అండ్ తుమ్మల.. వన్‌ టు వన్‌ మాట్లాడుకున్నారు. మెయిన్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికలు, పార్టీ పరిస్థితిపైనే వీళ్లిద్దరూ చర్చించారు. వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలిచేలా కలిసి పనిచేద్దామన్నారు తుమ్మల. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బీఆర్‌ఎస్‌ బలోపేతం కోసం కృషిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభలు, సమావేశాలు నిర్వహించాలని సలహా ఇచ్చారు. అదే టైమ్‌లో రేగాకు వ్యక్తిగత సలహాలు కూడా ఇచ్చారు తుమ్మల.

పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వాళ్లుంటారు జాగ్రత్త అంటూ రేగాను హెచ్చరించారు. మోసగాళ్లు, వెన్నుపోటుదారుల విషయంలో పార్టీ కేడర్‌ కూడా అలర్ట్‌గా ఉండాలని సూచించారు. రేగా కాంతారావు విజన్‌ ఉన్న లీడర్‌ అన్న తుమ్మల నాగేశ్వర్రావు, అతనిని గెలిపించుకునే బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. మొత్తానికి, రేగా కాంతారావు, తుమ్మల నాగేశ్వర్రావు మీటింగ్‌.. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..