AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీతాలకోసం ఈఎస్ఐ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా

రాష్ట్రంలోని ఈఎస్ఐ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కు జీతాలు చెల్లించాలంటూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలంటూ..

జీతాలకోసం ఈఎస్ఐ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
Anil kumar poka
|

Updated on: Sep 18, 2020 | 8:53 PM

Share

రాష్ట్రంలోని ఈఎస్ఐ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కు జీతాలు చెల్లించాలంటూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలంటూ ముషీరాబాద్ లోని ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. 950 మంది ఉద్యోగులకుగాను 635 మందిని మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారని మిగతా ఉద్యోగులు ఏమైపోయారని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యపు సమాధానం మరింత ఇబ్బందులకు గురి చేస్తోందని వారు వాపోయారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి క్లియరెన్స్ వచ్చినప్పటికీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో ధర్నా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలువురు అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాపై మెయిన్ స్ట్రీమ్ లో పనిచేస్తున్న సిబ్బందికి ఇలాంటి ప్రోత్సహకాలు లేకపోవడంపై మండిపడ్డారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మహమ్మద్ యూసుఫ్, ఈఎస్ఐ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ రేణుక, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

Follow Us
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..
జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో
జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో
ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..
ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు