
ఇదిగో పైన ఫోటోలో ఈ బిల్ ఆపరేటర్ వినియోగిస్తున్న మిషన్ ఇప్పుడు మీ విద్యుత్ వినియోగంపై పూర్తి లెక్కలు తీయనుంది. ఇప్పటి వరకు, బిల్లింగ్ ఆపరేటర్లు మీటర్ రీడింగ్‌లను ఎంటర్ చేసే విధానం అవుట్‌డేటెడ్‌గా మారింది. ఈ విదానానికి స్వస్థి పలికింది విద్యుత్ శాఖ. తాజాగా ఈ స్కానింగ్ మిషన్లను విద్యుత్ శాఖ బిల్లింగ్ ఆపరేటర్లకు అందజేసింది. వీటిని ఉపయోగించి, మీటర్ స్కాన్ చేస్తే, వినియోగం సంబంధించి ప్రతి యూనిట్‌ను రికార్డ్ చేయవచ్చు. ఈ పరికరాలు పూర్తి కచ్చితత్వంతో విద్యుత్ వినియోగం డేటాను సేకరిస్తాయి. దీంతో డేటా లోపాలు లేకుండా కచ్చితమైన బిల్ జనరేట్ అవుతుంది.
ఇంతకు ముందు, చాలా మంది రీడింగ్ ట్యాంపరింగ్ చేసినట్లుగా కంప్లైంట్లు రావడంతో, ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకువచ్చింది విద్యుత్ శాఖ. ఇంతకు ముందులా విద్యుత్ రీడింగ్ మీటర్లను ట్యాంపర్ చేసి, ఎక్కువ వినియోగించినా దానిని తక్కువగా చూపించేవారిని అడ్డుకోవడానికి ఇది ప్రాపర్‌గా పని చేయనుంది.. గ్రామాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వల్ల ట్యాంపరింగ్ చేసే వారి సంఖ్య పెరిగింది,… 200 యూనిట్లు దాటిన కూడా కొంతమంది 200 కంటే తక్కువ యూనిట్లను నమోదు చేయిస్తున్నారు. దీనిని గమనించిన విద్యుత్ శాఖ ఈ నిర్ణయంతో ఆ ట్యాంపరింగ్‌లకు చెక్ పెట్టాలని భావించి ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తుంది..
ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయడం:
ఇప్పటివరకు, మీటర్ రీడింగ్‌కి సంబంధించిన కొన్ని సమస్యలు వస్తే, డోర్ లాక్ ఉన్నప్పుడు లేదా మీటర్ పనిచేయకపోతే, నామినల్ యూనిట్లను నమోదు చేసేవాళ్లు. కాని ఇప్పుడు ఈ కొత్త డివైజ్‌తో అలా కుదరదు.. డోర్ లాక్ ఉన్నా, విద్యుత్ మీటర్ వినియోగంలో లేకపోయిన ఆ ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. ఈ విధానం వల్ల, మీటర్ రీడింగ్‌కి సంబంధించి ఎలాంటి మోసాలు జరగకుండా కాపాడవచ్చు అని భావిస్తోంది విద్యుత్ శాఖ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..