Telangana Elections: ఎల్లారెడ్డిలో ఆ నేత మిస్సింగ్.. వారు అనుకుంటున్న ముచ్చట నిజమేనా?

ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఆ నేత‌ల సైలంట్ ఇప్పుడు అంద‌రిని ఆలోచ‌న‌లో ప‌డేస్తుంద‌ట.. కారు దిగి క‌మలంలో చేరిన ఆ నేత చాల కాలంగా సైలంట్ గా ఉండ‌టంతో క్యాడ‌ర్ అంతా క‌న్‌ప్యూజ‌న్ లోకి వెళ్లింద‌ట. అస‌లే మాస్ లీడర్ గా పేరున్న నేత‌.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. ఇప్పుడు అస‌లు పాలిటిక్స్ కే దూరంగా ఉండ‌టం అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతుంద‌ట. ఉన్న పార్టీలో ఇమ‌డ‌లేక సైలంట్ గా ఉంటున్నారా.? లేక ఏక్కడినుండైనా బెటర్ అఫ‌ర్ వ‌చ్చిందా.? అనే గుస‌గుస‌లు ఇప్పుడు ఆ నియోజక‌వ‌ర్గంలో గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.

Telangana Elections: ఎల్లారెడ్డిలో ఆ నేత మిస్సింగ్.. వారు అనుకుంటున్న ముచ్చట నిజమేనా?
BJP

Edited By:

Updated on: Sep 21, 2023 | 10:10 PM

ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఆ నేత‌ల సైలంట్ ఇప్పుడు అంద‌రిని ఆలోచ‌న‌లో ప‌డేస్తుంద‌ట.. కారు దిగి క‌మలంలో చేరిన ఆ నేత చాల కాలంగా సైలంట్ గా ఉండ‌టంతో క్యాడ‌ర్ అంతా క‌న్‌ప్యూజ‌న్ లోకి వెళ్లింద‌ట. అస‌లే మాస్ లీడర్ గా పేరున్న నేత‌.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. ఇప్పుడు అస‌లు పాలిటిక్స్ కే దూరంగా ఉండ‌టం అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతుంద‌ట. ఉన్న పార్టీలో ఇమ‌డ‌లేక సైలంట్ గా ఉంటున్నారా.? లేక ఏక్కడినుండైనా బెటర్ అఫ‌ర్ వ‌చ్చిందా.? అనే గుస‌గుస‌లు ఇప్పుడు ఆ నియోజక‌వ‌ర్గంలో గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.

ఏనుగు రవీందర్ రెడ్డి.. కామారెడ్డి జిల్లా పొలిటికల్ సర్కిల్‌లో పరిచయం అక్కరలేని సీనియర్ నాయకుడు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఓ ఊపు ఊపిన ప్రజా ప్రతినిధి. తెలంగాణ ఉద్యమకారునిగా మంచి గుర్తింపు ఉంది. గులాబీ పార్టీలో కీలక నేతగా, పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితునిగా పేరుండేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి జాజుల సురేందర్ చేతిలో రవీందర్ రెడ్డి ఓటమిపాలయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో.. సురేందర్ గులాబీ తీర్థం పుచ్చుకున్నా కూడ.. ఏనుగు మాత్రం బీఆర్ఎస్‌లోనే ఉంటూ త‌న ప‌ని తాను చేసుకున్నారు. కానీ, అదే స‌మ‌యంలో త‌న ఉద్యమ స‌హ‌చ‌రుడు ఈటల‌ను కేసీఆర్ పార్టీ నుండి, ప్రభుత్వం నుండి బ‌య‌ట‌కు పంప‌డంతో ఈటలతో మొద‌టి నుండి ఉన్న సంబందాల‌తో ఆయనకు మద్ధుతుగా నిలిచారు రవీందర్ రెడ్డి. ఆ క్రమంలో ఈటల‌తో పాటే త‌ను కూడా గులాబి పార్టీపై తిరుగుబాటు జెండా ఎగ‌ర‌వేసారు. ఆ ప‌రిణామ క్రమంలోనే ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కూడ‌ కప్పుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన హుజురాబాద్ ఎన్నిక‌ల్లో ఈటల‌తో పాటు ప‌ని చేశారు. దాదాపు రెండు నెల‌లు హుజురాబాద్ లోనే గడిపారు ఏనుగు రవీందర్ రెడ్డి. త‌ర్వతా ఈటల గెలిచారు. పార్టీలో మంచి కీ రోల్ కూడ పోశిస్తున్నా.. రవీందర్ రెడ్డి మాత్రం అంత యాక్టివ్ గా క‌నిపించ‌డం లేదు.

గ‌త కొంత కాలంగా క‌నిపించ‌ని రవీందర్ రెడ్డి..

ఇక ఈ ప‌రిణామ‌ల‌తోనే ఇప్పుడు చ‌ర్చ మొద‌ల‌యింది. గ‌త కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి క‌నిపించ‌డం లేదట. బండి సంజ‌య్ పాద‌యాత్ర మిన‌హ ఎక్కడ రవీందర్ రెడ్డి కనిపించ‌డం లేద‌నేది ఇప్పుడు క్యాడ‌ర్‌లో టాక్ న‌డుస్తుంద‌ట. మాస్ లీడ‌ర్ గా ఎప్పుడు జ‌నాల్లో ఉంటారు అనే పేరున్న ఏనుగు.. ఎందుకు ఒక్కసారిగా సైలంట్ అయ్యారు అనేది ఇప్పుడు హ‌ట్ టాఫిక్ గా మారింది. కాషాయ పార్టీలో ఇమడ‌లేక పోతున్నారా.? లేదా అక్కడి స‌ఫ‌కేష‌న్‌ను త‌ట్టుకోలేక‌పోతున్నారా? అనే చ‌ర్చ న‌డుస్తుంది పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో. అటు కాంగ్రెస్, టిఆర్ఎస్ చేసిన స‌ర్వేలు కూడ ఏనుగు ను సైలంట్ అయ్యేలా చేసాయ‌ట. రెండు పార్టీలు చేసిన స‌ర్వేల్లో ఏనుగుకు రాజకీయంగా కొంత రిలాక్సేషన్ దొరికిందట. ఎల్లారెడ్డి లో ఏనుగు ప్రభ వెలిగి పోతుందని రెండు సర్వేలు తేల్చడంతో ఇప్పుడే ఎందుకు తోంద‌ర‌ప‌డ‌టం అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట.

అందుకే గ్యాప్..

ఇక అందుకే ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకోని ఎన్నిక‌ల టైమ్‌లో ఈ రెండు పార్టీల మూడ్ ను బట్టి ముందుకు వెళదామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట. అటు గులాబీ బాస్‌తో కూడా పూర్తిగా సంబధాలు తెంచుకోలేద‌ట ఏనుగు రవీందర్ రెడ్డి. ఉద్యమ‌కాలంలో తోడుగా ఉండ‌టంతో ఆ సానుభూతి కూడ ఏనుగు పై ఉంద‌ట. దీంతో ఎందుకొచ్చిన బాద‌లే అని బీజేపీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నార‌ట ఏనుగు. చివ‌ర‌లో కేసీఆర్ రా త‌మ్మి అని పిలిచినా ఆశ్చర్యం ఏమి లేదంటున్నారు రవీందర్ రెడ్డి అనుచరులు. ఇక అటు నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ బలంగా ఉంది. ఇటు ఏనుగుకు ఉన్న ప‌ర్సన‌ల్ చరిష్మా తో పాటుగా పార్టీ తోడైతే కాంగ్రెస్ కు తిరుగుండ‌దు అనే ఆలోచ‌న‌లో కూడ ఆ పార్టీ ఉంద‌ట. అందుకే అటు ఏనుగు, ఇటు కాంగ్రెస్ ఒక‌రితో ఒక‌రు ట‌చ్ లో ఉన్నార‌ట. ఈ కారణంగానూ ఈ సైలేంట్‌ను మెయింటైన్ చేస్తున్నారట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..