Telangana Elections Results 2023: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టబోతున్న 15 మంది వైద్యులు

| Edited By: Balaraju Goud

Dec 03, 2023 | 11:15 PM

తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అవసరమైన మెజారిఃటీ దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్‌ ఆశలు గల్లంతయ్యాయి.

Telangana Elections Results 2023: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టబోతున్న 15 మంది వైద్యులు
Doctors In Assembly
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అవసరమైన మెజారిఃటీ దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్‌ ఆశలు గల్లంతయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీకి 15 మంది వైద్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అందులో కాంగ్రెస్ నుంచి 11 మంది వైద్యులు ఎన్నిక కాగాచ ఒకరు బీజేపీ నుంచి గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ముగ్గురు డాక్టర్లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.

రోగాలను నయం చేయడమే కాదు.. జనం సమస్యలు తీర్చేందుకు ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన వైద్యులు విజయం సాధించారు. అసెంబ్లీలో అధ్యక్షా.. అనేందుకు రెఢి అయ్యారు. డోర్నకల్‌ నియోజకవర్గంలో వైద్య సేవలు అందిస్తున్న రామచంద్ర నాయక్ కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఎంఎస్ జనరల్‌ సర్జన్‌ అయిన రామచంద్ర నాయక్‌ తొలిసారిగా అసెంబ్లీ అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. సీనియర్ రాజకీయ నాయకులు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రెడ్యానాయక్‌పై రామచంద్ర నాయక్ విజయం సాధించారు. ఇక అచ్చంపేట నియోజకవర్గం నుంచి డా.వంశీకృష్ణ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. డా.వంశీకృష్ణ ఎంఎస్ జనరల్‌ సర్జన్‌ కావడం విశేషం. మరికొందరు డాక్టర్లు కూడా ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అందులో ఒక యువ డాక్టర్ కూడా ఉండటం విశేషం.

ఎమ్మెల్యేలుగా గెలుపొందిన డాక్టర్లు వీరేః

1. డా. రామచంద్ర నాయక్‌, ఎంఎస్ జనరల్‌ సర్జన్‌ , డోర్నకల్, కాంగ్రెస్

2. డా. వంశీకృష్ణ, ఎంఎస్ జనరల్‌ సర్జన్‌ , అచ్చంపేట, కాంగ్రెస్

3. డా.మురళి నాయక్, ఎంఎస్ జనరల్‌ సర్జన్‌, మహబూబాబాద్, కాంగ్రెస్

4. డా.సత్యనారాయణ, ఎంఎస్ జనరల్‌ సర్జన్‌, మానకొండూరు, కాంగ్రెస్

5. డా. మైనంపల్లి రోహిత్ రావు, ఎంబీబీఎస్, మెదక్, కాంగ్రెస్

6. డా.పర్ణికా రెడ్డి, జనరల్‌ ఫిజీషియన్‌, నారాయణపేట్‌, కాంగ్రెస్‌

7. డా. సంజీవ రెడ్డి, పీడియాట్రిక్‌ వైద్యులు, నారాయణ్‌ఖేడ్, కాంగ్రెస్.

8. డా.వివేక్‌ వెంకటస్వామి, ఎంబీబీఎస్, చెన్నూర్, కాంగ్రెస్

9. డా. భూపతి రెడ్డి, ఎంఎస్ ఆర్థో, నిజామాబాద్ రూరల్, కాంగ్రెస్

10. డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎండీఎస్, నాగర్‌కర్నూల్, కాంగ్రెస్

11. డా. రాగమయి, ఎండీ పల్మనాలజిస్ట్, సత్తుపల్లి, కాంగ్రెస్

12. డా.తెల్లం వెంకట్‌రావు, ఎంఎస్ ఆర్థో, భద్రాచలం, బీఆర్‌ఎస్

13. డా.సంజయ్ కుమార్, ఎంఎస్ ఆప్తమాలజీ, జగిత్యాల, బీఆర్‌ఎస్.

14. డా. కల్వకుంట్ల సంజయ్, ఎంసీహెచ్‌ న్యూరో, కోరుట్ల, బీఆర్‌ఎస్

15. డా.పాల్వాయి హరీష్, ఎంఎస్ ఆర్థో, సిర్పూర్, బీజేపీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :