AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయానికే సాయం.. సీఎం, మంత్రుల నామినేషన్ ఖర్చులకు ఫించన్ సొమ్ము..!

Telangana Assembly Elections 2023: ఆడవుల ఖిల్లా ఆదిలాబాద్ జిల్లా ఆదర్శ గ్రామం ముఖరా(కె) గ్రామస్తులు మరోసారి‌ శభాష్ అని పించుకున్నారు. ఐక్యంగా ఉంటూ గ్రామాభివృద్దిలో వినూత్న ఒరవడితో దూసుకెళుతున్న గ్రామస్తులు.. మరోసారి‌ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈసారి సాయానికే సాయం చేసి వావ్ అనిపించుకున్నారు.

సాయానికే సాయం.. సీఎం, మంత్రుల నామినేషన్ ఖర్చులకు ఫించన్ సొమ్ము..!
Mukhara K Villagers Meet Cm Kcr
Naresh Gollana
| Edited By: |

Updated on: Oct 16, 2023 | 5:20 PM

Share

ఆడవుల ఖిల్లా  ఆదిలాబాద్ జిల్లా ఆదర్శ గ్రామం ముఖరా(కె) గ్రామస్తులు మరోసారి‌ శభాష్ అని పించుకున్నారు. ఐక్యంగా ఉంటూ గ్రామాభివృద్దిలో వినూత్న ఒరవడితో దూసుకెళుతున్న గ్రామస్తులు.. మరోసారి‌ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈసారి సాయానికే సాయం చేసి వావ్ అనిపించుకున్నారు. ఇంత కాలం తమ జీవితాల్లో వెలుగులు నింపి, ఆర్థిక సాయంతో ఆత్మగౌరవాన్ని పెంచిన బీఆర్ఎస్ సర్కార్‌ పట్ల పింఛనుదారులు కృతజ్జత చాటుకున్నారు. తమకు నెల నెలా అందుతున్న ఆసరా పింఛన్ లోని కొంత సొమ్మును సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ ఎన్నికల ఖర్చులకోసం ఉడతాభక్తి సాయం అందించాలని నిర్ణయించుకున్నారు.

Mukhara K Village Pensioners

Mukhara K Village Pensioners

ఇన్నాళ్లు తమకు ఆసరా ఫించన్లు అందిస్తూ తమకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ కు తమ వంతుగా ఉడతా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ నామినేషన్ల ఖర్చులకు డబ్బులు అందించే తమ ఆత్మీయతను చాటుకున్నారు. గ్రామంలోని పించను దారులంతా కలిసి తలా వెయ్యి రూపాయల చొప్పున రూ.లక్ష నగదును జమ చేసి విరాళంగా సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి చేతికి అందించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు తమ వంతుగా నామినేషన్‌ ఖర్చుల కోసం ఇచ్చి రావాలని పింఛన్‌దారులు సర్పంచిని కోరారు. దీంతో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ఎంపీ సంతోష్‌ కుమార్‌ సహకారం కోరారు ముఖరా (కె) సర్పంచ్ గాడ్గె మీనాక్షి.

ఎన్నికల మేనిపెస్టో ప్రకటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌కు వస్తున్నారని.. కలుసుకునేందుకు అవకాశముందని ఎంపీ సంతోష్ కుమార్ ముఖరా గ్రామ సర్పంచ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఒక రోజు ముందే కుటుంబ సభ్యులతో కలిసి హైదరబాద్ చేరుకున్న సర్పంచ్ మీనాక్షి.. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. రూ.50 వేల చొప్పున రెండు చెక్కులను ముఖ్యమంత్రికి అందజేశారు. చెక్కులను అందుకున్న సీఎం కేసీఆర్.. ముఖరా.కె గ్రామస్తులకు కృతజ్జతలు తెలిపారు. తెలంగాణ పల్లెల్లో వెల్లివిరుస్తున్న చైతన్యానికి ముఖరా గ్రామం ప్రతీకగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ కొనియాడారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..