Telangana: సీఎం కేసీఆర్‌ జనగామ ప్రజా ఆశీర్వాద సభ

Telangana: సీఎం కేసీఆర్‌ జనగామ ప్రజా ఆశీర్వాద సభ

Ram Naramaneni

|

Updated on: Oct 16, 2023 | 5:01 PM

అధికార BRS ఇప్పటికే మేనిఫెస్టోను ప్రకటించడంతోపాటు ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. ఆదివారం హుస్నాబాద్‌లో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం నేడు జనగామలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తలు ఈ సభలో పాల్గొన్నారు.

జనగామలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 70 వేల మంది ఈ సభకు హాజరయ్యారు.  సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కటౌట్లు, హోర్డింగ్‌లతో నిండిపోయింది.  సభా వేదికపై కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు పొన్నాల. ముఖ్యమంత్రి గులాబీ కండువాను కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. జనగామ సభ తర్వాత భువనగిరి సభకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. సాయంత్రం జూనియర్‌ కాలేజీ మైదానంలో కేసీఆర్‌ సభ ఉంది. బోనాలు, బతుకమ్మలు, బైక్‌ ర్యాలీలతో.. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు BRS నేతల ఏర్పాట్లు చేశారు. ఆదివారం 69 మందికి బీఫాంలు ఇచ్చారు సీఎం కేసీఆర్‌. ఇవాళ మరికొంతమందికి బీఫాంలు అందించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

 

Published on: Oct 16, 2023 04:21 PM