Telangana: అమల్లోకి ఎన్నికల కోడ్.. సామాన్యులకు గుండెపోటు తెప్పిస్తున్న ఈసీ నిబంధనలు..

| Edited By: Jyothi Gadda

Oct 21, 2023 | 4:01 PM

Khammam: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ అవసరాల రిత్యా బ్యాంకుల ద్వారా చేస్తున్న లావాదేవీలకు సంబంధించిన విషయాలలో కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం ప్రజలకు ఇబ్బందిగా మారింది, రాజకీయ నాయకులు బడా బాబులు లక్షల్లో డబ్బులు తరలిస్తున్న పట్టించుకోని అధికారులు బ్యాంకుల వద్ద మఫ్టీలో పోలీసులను పెట్టి సొంత అవసరాల కోసం బ్యాంకుల నుండి తీసుకెళ్తున్న నగదును నిబంధనల పేరుతో సీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు..

Telangana: అమల్లోకి ఎన్నికల కోడ్.. సామాన్యులకు గుండెపోటు తెప్పిస్తున్న ఈసీ నిబంధనలు..
Common People Trouble
Follow us on

ఖమ్మం జిల్లా, అక్టోబర్21; సామాన్యులకు గుండెపోటు తెప్పిస్తున్న ఈసీ నిబంధనలు..గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు, చిన్న చిన్న అవసరాల కోసం తీసుకెళ్తున్న డబ్బులను కూడా పట్టుకుంటున్న పోలీసులు, ఆధారాలు సమర్పిస్తున్న ట్రాక్ రికార్డు పెంచుకునేందుకు డబ్బులను సీజ్ చేస్తూన్న అధికారులు, లబోదిపోమంటున్న జనం..  ఉమ్మడి ఖమ్మం జిల్లా,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలోనీ ప్రజలకు ఎన్నికల నిబంధనలు గుండెపోటు తెప్పిస్తున్నాయి, ఎన్నికల నియమావళికి సంబంధించి అవగాహన లేని ఏజెన్సీ జనం అధికారుల తనిఖీల మూలంగా నిత్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గ్రామాల్లో కూలీ పనులకు వెళ్లే మహిళలు తాము దాచుకున్న డబ్బులను బ్యాంకు నుండి తీసుకెళ్తున్న క్రమంలో తనిఖీల పేరుతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని ఇబ్బందులకు చేస్తుండడం ప్రజలకు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతుంది..

ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు బ్యాంకు లావాదేవీల ద్వారా నగదును తీసుకెళ్తున్న ట్రాక్ రికార్డులలో కేసుల నమోదు ఎక్కువ చూపించుకోవడం కోసం పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..ఎన్నికల నియమావళి పేరుతో తనిఖీలు నిర్వహిస్తూ అన్ని ఆధారాలు చూపిస్తున్న కూడా వాటిని సీజ్ చేసి ఎన్నికల నియమావళి పేరుతో సామాన్యులను వేధింపులకు గురి చేస్తున్నారంటూ అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు..

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ అవసరాల రిత్యా బ్యాంకుల ద్వారా చేస్తున్న లావాదేవీలకు సంబంధించిన విషయాలలో కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం ప్రజలకు ఇబ్బందిగా మారింది, రాజకీయ నాయకులు బడా బాబులు లక్షల్లో డబ్బులు తరలిస్తున్న పట్టించుకోని అధికారులు బ్యాంకుల వద్ద మఫ్టీలో పోలీసులను పెట్టి సొంత అవసరాల కోసం బ్యాంకుల నుండి తీసుకెళ్తున్న నగదును నిబంధనల పేరుతో సీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు..

ఇవి కూడా చదవండి

నిన్న పినపాక, మణుగూరు మండలాల్లో జరిగిన మూడు ఘటనలు అందుకు నిదర్శనం.. ఎడుళ్ల బయ్యారంలో డ్వాక్రా సంఘానికి చెందిన మహిళలు బ్యాంకు ద్వారా 17 లక్షలు లోన్ తీసుకొని ఆ డబ్బును తీసుకెళ్తుండగా అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు అధికారులు హడావుడి చేశారు, దీంతో ఆ మహిళలకు గుండెపోటు వచ్చినంత పని అయింది, మరో ఘటనలో బ్యాంకులో అప్పు తీర్చేందుకు బంగారం తనకా పెట్టి తీసుకెళ్తున్న 50000 నగదును సీజ్ చేసి ఓ సర్పంచ్ కి చుక్కలు చూపించారు అధికారులు, సామాన్యులు డబ్బులకు అన్ని ఆధారాలు ఉన్న అవేమీ పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికల నియమావళి పేరుతో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సామాన్యులను వేధింపుల గురి చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..