Telangana Elections: తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ఫూచర్‌పై సందిగ్ధత.. టీటీడీపీకి అచ్చిరాని అధ్యక్షులు..

Kasani Gnaneshwar Mudiraj: ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నాలుగు సార్లు అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌లోనూ 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ విడిపోయాక తెలుగుదేశం పార్టీని తెలంగాణ తెలుగుదేశం పార్టీగా శాఖను ఏర్పాటు చేసింది. 2014లో 15 సీట్లను సాధించింది తెలంగాణలో... మొదట ఎల్.రమణను అధ్యక్షునిగా నియమించారు. ఆరేళ్లపాటు ఆయన తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా కొనసాగారు. ఆ వెంటనే భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే..

Telangana Elections: తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ఫూచర్‌పై సందిగ్ధత.. టీటీడీపీకి అచ్చిరాని అధ్యక్షులు..
Kasani Gnaneshwar Mudiraj

Edited By:

Updated on: Oct 31, 2023 | 1:20 PM

హైదరాబాద్, అక్టోబర్ 31: ఎన్టీఆర్ ప్రభంజనంతో ఏర్పడ్డ పార్టీ తెలుగుదేశం(టీడీపీ). ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నాలుగు సార్లు అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌లోనూ 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ విడిపోయాక తెలుగుదేశం పార్టీని తెలంగాణ తెలుగుదేశం పార్టీగా శాఖను ఏర్పాటు చేసింది. 2014లో 15 సీట్లను సాధించింది తెలంగాణలో… మొదట ఎల్.రమణను అధ్యక్షునిగా నియమించారు. ఆరేళ్లపాటు ఆయన తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా కొనసాగారు. ఆ వెంటనే భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ కండువా కప్పుకున్నారు.

ఆ తర్వాత 2021లో బక్కని నరసింహులు టీటీడీపీ బాధ్యతలు తీసుకున్నారు.. కొద్ది నెలలకి ఆయన స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. ఏడాదిలోపే ఆయన కూడా పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. టిఆర్ఎస్ కండువా కప్పుకొనున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ పార్టీ వ్యవహారాలను అడపాదన పట్టించుకునేవారు.

అయినప్పటికీ ఓటుకు నోటు కేసు వల్ల పార్టీ తెలంగాణలో దిగజారిపోయింది. టీడీఎల్‌పీ అధ్యక్షులుగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఆ తర్వాత పార్టీలో కొంత స్ట్రాంగ్ లీడర్ గా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రాలో టిడిపి ఓటమిపాలయ్యాక టీటీడీపీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు. లోకేష్ కూడా పెద్దగా తెలంగాణలో పర్యటనలు చేయలేదు. దీంతో నిరుత్సాహంతో ఉన్న క్యాడర్ చేజారిపోయింది. పార్టీ అధ్యక్షులై పార్టీ మారడం చాలా అరుదైన అంశం. కానీ గత మూడేళ్లుగా ఇద్దరు పార్టీ అధ్యక్షులు పార్టీ వీడి బిఆర్ఎస్ లో చేరిపోయారు.

ఇక తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చంద్రబాబు ప్రకటన పట్ల వ్యతిరేకత కనబరుస్తూ రాజీనామా చేశారు కాసాని జ్ఞానేశ్వర్. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. పార్టీ డబ్బులు ఇవ్వకపోయినా ప్రతి రూపాయి తానే ఖర్చు పెట్టి తెలంగాణలో ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమానికి రూపకల్పన చేశానని.. ఖమ్మంలో సభ నిర్వహించాను, నిజామాబాద్‌లో కూడా బహిరంగ సభకు ఏర్పాటు చేసుకుంటున్నాను.. ఈ సమయంలో ఇలాంటి ప్రకటన పార్టీ కేడర్‌ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఎన్నికల్లో తడాఖా చూపిస్తామంటూ చెప్పిన నందమూరి బాలకృష్ణ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదని అన్నారు. తెలంగాణతో సంబంధమే లేదన్నట్టుగా పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు కాసాని జ్ఞానేశ్వర్. భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ మునగడ ఉంటుందా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి