Telangana Election: ఓటు వేస్తే అంతే సంగతులు అంటూ గాంధీభవన్ గోడలపై పోస్టర్లు..!

| Edited By: Balaraju Goud

Nov 19, 2023 | 11:42 AM

పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది పోటాపోటీ ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. లోకల్ నాయకులే కాదు.. జాతీయ నాయకులు సైతం ప్రచారంలో పాల్గొంటూ.. ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు గుంపిస్తున్నారు. ఇక, సోషల్ మీడియా గురించి చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా ఎన్నికలకు సంబంధించిన టాపిక్‌కే కనిపిస్తోంది.

Telangana Election: ఓటు వేస్తే అంతే సంగతులు అంటూ గాంధీభవన్ గోడలపై పోస్టర్లు..!
Disparaging 6 Guaranties Posters
Follow us on

పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది పోటాపోటీ ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. లోకల్ నాయకులే కాదు.. జాతీయ నాయకులు సైతం ప్రచారంలో పాల్గొంటూ.. ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు గుంపిస్తున్నారు. ఇక, సోషల్ మీడియా గురించి చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా ఎన్నికలకు సంబంధించిన టాపిక్‌కే కనిపిస్తోంది. ప్రతి అంశాన్ని కూడా పొలిటికల్ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు నాయకులు. పోలింగ్‌కు ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పార్టీల మాటల వాడి వేడి పెరుగుతోంది.

తాజాగా గాంధీభవన్ చుట్టూ వెలిసిన పోస్టర్లు కలకలాని రేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ వేసిన పోస్టర్లుగా భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ నడిబొడ్డున గాంధీభవన్ సమీపంలోని మెట్రో పిల్లర్ల నుంచి గాంధీభవన్ గోడల మీద వరకు పోస్టర్లు వెలిశాయి. గతంలో ఈ పోస్టర్ల ప్రచారం చాలా జరిగింది. బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి బీజేపీ సాలు దొర సెలవు దొర అనే పేరుతో పోస్టర్లను వేశాయి. కుటుంబ పాలన అంటూ కూడా అనేక పోస్టర్లను వేసింది. దానికి ధీటుగా బీఆర్ఎస్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు జరిగినప్పుడల్లా వారికి వ్యతిరేకంగా అనేక పోస్టర్లు వేసింది.

పది తలల రావణాసురుడితో పోలుస్తూ మోదీ పోస్టర్లు అలాగే బీజేపీ తెలంగాణకు ఏం చేసింది అంటూ కూడా అనేక పోస్టర్లు వేసింది బీఆర్ఎస్. అయితే తాజాగా కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ చుట్టూ కూడా అనేక పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా స్కాంగ్రస్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు సంబంధించి వ్యంగ్యంగా ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. కాంగ్రెస్ కి ఓటు వేయొద్దంటు భస్మాసుర కాంగ్రెస్ అంటూ గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కామ్ లకు సంబంధించిన దాన్ని వివరిస్తూ పోస్టర్లు కనిపించాయి. కాంగ్రెస్‌కు ఓటేస్తే భూములు కబ్జా చేస్తాం.. అయిపోతాయి అంటూ ఆరు క్యారంటీలపై సెటైరికల్‌గా పోస్టర్లు వేశారు. మరి దీనిపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…