Telangana Election: ప్రచారంలో డోస్‌ పెంచిన గులాబీ బాస్.. కాంగ్రెస్, బీజేపీపై చెలరేగిన కేసీఆర్

|

Nov 19, 2023 | 6:36 AM

పోలింగ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచారు. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల స్పీచ్‌‌లో డోస్ పెంచారు సీఎం కేసీఆర్. పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అటు కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్‌. అసలు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Telangana Election:  ప్రచారంలో డోస్‌ పెంచిన గులాబీ బాస్.. కాంగ్రెస్, బీజేపీపై చెలరేగిన కేసీఆర్
CM KCR Revanth Reddy
Follow us on

పోలింగ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచారు. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల స్పీచ్‌‌లో డోస్ పెంచారు సీఎం కేసీఆర్. పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అటు కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్‌. అసలు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

పోలింగ్‌ టైం దగ్గరపడుతుండడంతో స్పీచ్‌లో డోస్ పెంచారు గులాబీ బాస్ కేసీఆర్. ప్రచారంతో రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాలను చుట్టేస్తూ.. సూటిగా పాయింట్‌ టూ పాయింట్‌ మాట్లాడే కేసీఆర్ సెడన్‌గా చేంజ్‌ చేశారు. కేవలం చేర్యాలలో ఒక్క సభను మాత్రమే నిర్వహించారు. నాలుగు సభలకు సరిపడా డోస్ ఇచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీలపై చెలరేగిపోయారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, చంద్రబాబుకు చెంచాగిరి చేసుకునే రేవంత్‌రెడ్డి తనను తిడుతున్నాడంటూ మండిపడ్డారు. ఇది మ‌ర్యాదానా..? అంటూ ప్రశ్నించారు. తనకు పిండం పెడుతా అంట‌డు. ఎవ‌రికి పిండం పెట్టాల్నో మీరు నిర్ణయించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్.

కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాను కామారెడ్డిలో నామినేషన్ వేయడాన్ని జీర్ణించుకోలేకే తనను పిచ్చి కుక్క అని తిడుతున్నారని చెప్పారు రేవంత్‌ రెడ్డి. దళితుడిని సీఎంగా చేస్తానన్న కేసీఆర్ మాట తప్పి, ఇప్పుడు కేటీఆర్‌ను సీఎంగా చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌, కేసీఆర్‌లపై విరుచుకుపడ్డారు రేవంత్‌ రెడ్డి.

తన వయస్సుకు కూడా విలువ ఇవ్వకుండా.. రేవంత్‌ రెడ్డి తనను తిట్టిన విషయాలను ప్రజలతో పంచుకున్నారు కేసీఆర్. మరోవైపు తనపై కేటీఆర్, కేసీఆర్ చేస్తున్న ఆరోపణలను కామారెడ్డి ప్రజలకు వివరించారు రేవంత్ రెడ్డి. కామారెడ్డిని కాపాడేందుకే వచ్చానని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇలా ఎన్నికల ప్రచారంలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…