AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: తెలంగాణలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. ఒకవైపు నడ్డా.. మరోవైపు ప్రియాంక సభలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రిఅమిత్‌షా, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ ఎన్నికల సభలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. మరికొందరు బీజేపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణ బాట పట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ ఎన్నిక ప్రచారంలో బీజేపీ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ తరపున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారు.

Telangana Election: తెలంగాణలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. ఒకవైపు నడ్డా.. మరోవైపు ప్రియాంక సభలు
P Nadda, Priyanka Gandhi
Balaraju Goud
|

Updated on: Nov 19, 2023 | 10:45 AM

Share

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రిఅమిత్‌షా, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ ఎన్నికల సభలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. మరికొందరు బీజేపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణ బాట పట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ ఎన్నిక ప్రచారంలో బీజేపీ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ తరపున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారు.

రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అన్ని పార్టీల నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు దూకుడుగా జనంలోకి వెళ్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలను ప్రకటించిన అన్ని పార్టీలు ఇక ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి. 32 అంశాలు 10 ముఖ్యమైన అంశాలతో కూడిన.. సకల జనుల సౌభాగ్య తెలంగాణ ‘మన మోదీ గ్యారెంటీ.. బీజేపీ భరోసా’ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ.

ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తరుఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ పాల్గొన్నారు. మేనిఫెస్టో రిలీజ్‌ అయిన తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆదివారం బీజేపీ నిర్వహించే మూడు సభల్లో పాల్గొంటారు జేపీ నడ్డా. చేవెళ్ల, నారాయణపేట్‌ సభలకు హాజరవుతారు. అలాగే మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో నిర్వహించే రోడ్‌షో పాల్గొంటారు జేపీ నడ్డా. మేనిఫెస్టోను గడపగడపకు తీసుకెళ్లేలా పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేస్తారు నడ్డా.

మరోవైపు కాంగ్రెస్ కూడా అంతే దూకుడుతో ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే 66 హామీలు, 6 గ్యారెంటీలతో కూడిన మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్. 66 హామీలతో కూడిన మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రిలీజ్‌ చేశారు. అంతకు ముందు కాంగ్రెస్ 6గ్యారెంటీలను సోనియా గాంధీ చేతుల మీదుగా రీలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో మీటింగ్స్ ఏర్పాటు చేశారు. అయితే మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్‌ టైం ప్రియాంక గాంధీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రియాంకతో ఎన్నిక ప్రచారం నిర్వహిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. దీంతో ఆదివారం తెలంగాణకు వస్తున్నారు ప్రియాంక గాంధీ. ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, మేనిఫెస్టోపై ప్రచారం చేస్తారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ స్టార్ క్యాంపెనర్ల తోపాటు పార్టీ అగ్రనేతలతో బీజేపీ, కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచుతున్నాయి.

ఇక నవంబర్ 30న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాుల వెల్లడి కానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…