AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ మేనిఫెస్టోలో కామన్‌ అంశాలు.. ఎవరు ఎవరిని కాపీ కొట్టారు?

తెలంగాణలో ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్‌ అయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు కామన్‌గా ఉన్నాయి. ప్రధాన పార్టీల మేనిఫెస్టోలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ మేనిఫెస్టోల్లోని కొన్ని అంశాలు ఒకే విధంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. మూడు పార్టీల మేనిఫెస్టోల్లో కామన్ అంశాలేంటి? ఎవరు ఎవరిని చూసి కాపీకొట్టారు? మూడు పార్టీల మేనిఫెస్టోల్లో కామన్ అంశాలేంటో చూద్దాం..

Telangana Election: బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ మేనిఫెస్టోలో కామన్‌ అంశాలు.. ఎవరు ఎవరిని కాపీ కొట్టారు?
Election Manifesto In Telangana
Balaraju Goud
|

Updated on: Nov 19, 2023 | 10:45 AM

Share

తెలంగాణలో ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్‌ అయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు కామన్‌గా ఉన్నాయి. ప్రధాన పార్టీల మేనిఫెస్టోలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ మేనిఫెస్టోల్లోని కొన్ని అంశాలు ఒకే విధంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. మూడు పార్టీల మేనిఫెస్టోల్లో కామన్ అంశాలేంటి? ఎవరు ఎవరిని చూసి కాపీకొట్టారు? మూడు పార్టీల మేనిఫెస్టోల్లో కామన్ అంశాలేంటో చూద్దాం.

తెలంగాణలో ప్రధాన పార్టీలు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇప్పటికే 66 హామీలు.. 6గ్యారెంటీలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని హోటల్ కత్రియా టవర్స్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సకల జనుల సౌభాగ్య పేరుతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేసినట్లు చెప్పారు బీజేపీ నేతలు. 10 అంశాలు కలిగిన సకల జనుల సౌభాగ్య తెలంగాణ ‘మన మోదీ గ్యారెంటీ… బీజేపీ భరోసా’ మేనిఫెస్టో రిలీజ్ చేశారు అమిత్‌ షా. గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి పెట్రోల్ రేట్ల వరకు.. రైతుల దగ్గర నుంచి సింగరేణి కార్మికుల వరకు.. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి డొమెస్టిక్ వర్కర్స్ వరకు.. అన్ని వర్గాలను కవర్ చేస్తూ హామీలను ఇచ్చింది కమలం పార్టీ.

అయితే ప్రధాన పార్టీల మేనిఫెస్టోను పరిశీలిస్తే కొన్ని కొన్ని అంశాలు కామన్‌గా మార్పులు చేసినట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ రూ.500లకే గ్యాస్ సిలిండర్‌ ఇస్తామంటే, దాన్ని బీఆర్ఎస్ రూ.400 లకే అందిస్తామని చెప్పింది. ఇదే అంశంపై బీజేపీ ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు ధరణి యాప్‌ ద్వారా ఎంతో మేలు చేశామని బీఆర్ఎస్ చెబుతుంటే, ధరణి ద్వారా అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. ధరణి ప్లేస్‌లో కాంగ్రెస్‌ మెరుగైన పోర్టల్‌ను తీసుకొస్తామంటే, బీజేపీ మీ భూమి వ్యవస్థను తీసుకు వస్తామని చెబుతుంది.

ప్రజా పాలన విషయంలోను కాంగ్రెస్ సుపరిపాలను అందిస్తామంటుంది. అటు బీజేపీ ప్రజలందరికీ సుపరిపాలన – సమర్థవంతమైన పాలన అందిస్తామని చెబుతుంది. రైతు బంధు, వరికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 భోనస్ ఇస్తామని కాంగ్రెస్ చెప్తే, బీజేపీ వరికి రూ.3,100 మద్దతు ధర ప్రకటించింది. ఇక ఉద్యోగాల కల్పన, బీమా విషయంలో బీజేపీ, కాంగ్రెస్ అంశాల్లో చిన్న మార్పులు ఉన్నాయే తప్పా కామన్‌గానే ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. 18 ఏళ్లు పైబడి చదువుకునే యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే, బీజేపీ మాత్రం ల్యాప్‌ టాప్ ఇస్తామని చెప్పింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..