Telangana: సాత్విక్ ఆత్మహత్య ఘటనపై టీవీ9 ఎఫెక్ట్‌.. నేడు ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబిత భేటీ

|

Mar 06, 2023 | 7:57 AM

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై టీవీ9 ప్రచారం చేసిన వరుస కథనాలకు విద్యాశాఖ స్పందించింది. శ్రీచైతన్య కాలేజీలో చదువుతున్న సాత్విక్ సిబ్బంది టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న ఘటనను ప్రభుత్వం దృష్టికి..

Telangana: సాత్విక్ ఆత్మహత్య ఘటనపై టీవీ9 ఎఫెక్ట్‌.. నేడు ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబిత భేటీ
Sathwik Suicide
Follow us on

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై టీవీ9 ప్రచారం చేసిన వరుస కథనాలకు విద్యాశాఖ స్పందించింది. శ్రీచైతన్య కాలేజీలో చదువుతున్న సాత్విక్ సిబ్బంది టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. టీవీ9 వరుస కథనాలతో కదిలిన విద్యాశాఖ ఈ రోజు ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అవుతున్నారు. సాయంత్రం 4 గంటలకు M.C.R.H.R.Dలో జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి హాజరుకావాలని 14 ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

కార్పొరేట్ కాలేజీల పేరుతో కార్పొరేషన్‌ తరహా అక్రమాలు జరుగుతున్న సంగతి బట్టబలైంది. ఇంటర్‌ బోర్డు మత్తులో జోగుతుందన్న సంగతి ఎంక్వైరీలో తేలింది. శ్రీచైతన్య స్టూడెంట్‌ సాత్విక్‌ సూసైడ్‌ ఎపిసోడ్‌లో తవ్వేకొద్దీ సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయ్‌. సాత్విక్‌కు నార్సింగి శ్రీచైతన్య కాలేజ్‌లో అడ్మిషనే లేదని ఎంక్వైరీ కమిటీ నివేదికలో తేలింది. అయితే తన కుమారుడి అడ్మిషన్‌, ఫీజుల బిల్లులు అన్నీ నార్సింగి అడ్రస్‌తోనే ఇచ్చారని చెప్పారు సాత్విక్ తండ్రి రాజాప్రసాద్‌. కార్పొరేట్‌ కాలేజీల్లో జరుగుతోన్న ఈ బాగోతంపై ఎందుకు చర్యల్లేవో చెప్పాలని డిమాండ్‌ చేశారు సాత్విక్ పేరెంట్స్.

ఈ విషయం శ్రీచైతన్య విద్యాసంస్థ అక్రమాలకు, ఇంటర్‌ బోర్డ్ అలసత్వానికి, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట కాగా.. సాత్విక్ మృతిపై ఐదు రోజుల ఎంక్వైరీలో కమిటీ తేల్చింది దాదాపు శూన్యమని స్పష్టమైంది. సాత్విక్‌ డెడ్‌బాడీకి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగితే రిపోర్ట్‌లో గాంధీ అని రాశారు. దీంతో కమిటీ ఎంక్వైరీ అంతా భూటమని తేలింది. అయితే ఇవాళ్టి మంత్రి సబిత సమావేశంలో ఇంటర్ బోర్డు షరతులు ఏంటీ? ఎజెండా ఎలా ఉండబోతుంది? కాలేజీల ఓవరాక్షన్ పై చర్యలు తీసుకుంటారా? పిల్లల ప్రాణాలకు ఎంటా భరోసా కల్పిస్తారు? తూతూ మంత్రంగా సాగుతుందా? లేక సిరీయస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారా? తెలియాలంటే సాయంత్రం భేటీ వరకు వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.