Hyderabad: డీఏవీ స్కూల్‌ రీఓపెన్‌కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విద్యాశాఖ

|

Nov 01, 2022 | 4:11 PM

బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో నాలుగేళ్ల ఎల్కేజీ చిన్నారిపై లైంగిక దాడి ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను..

Hyderabad: డీఏవీ స్కూల్‌ రీఓపెన్‌కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విద్యాశాఖ
DAV Public School
Follow us on

బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో నాలుగేళ్ల ఎల్కేజీ చిన్నారిపై లైంగిక దాడి ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను పున ప్రారంభించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో డీఏవీ స్కూల్‌ పునరుద్ధరణకు విద్యాశాఖ మంగళవారం తాత్కాలిక అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ విద్యాసంవత్సరానికి మాత్రమే అనుమతి వర్తిస్తుందని స్పష్టం చేసింది.

కాగా డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ చదువుతున్న చిన్నారులపై ప్రిన్సిపల్‌తోపాటు డ్రైవర్‌ అఘాయిత్యాలకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని స్కూల్‌ గుర్తింపును కూడా రద్దు చేసింది. ఐతే స్కూల్‌ మూసివేతతో మిగతా పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారడంతో, పాఠశాలను తిరిగి ప్రారంభించాలని, స్కూల్‌ గుర్తింపు రద్దును వెనక్కి తీసుకోవాలని ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ దేవసేనకు వినతిపత్రాలు అందించారు. దీంతో ఈ విద్యా సంవత్సరానికి పాఠశాలలను కొనసాగించవచ్చని విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. విద్యాశాఖ సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.