Hyderabad: ఈ ఆఫర్ 31 వరకే.. తరువాత సీన్ వేరే ఉంటుంది.. జాయింట్ సీపీ కీలక వ్యాఖ్యలు..

|

Mar 04, 2022 | 5:20 PM

Hyderabad: ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో ఛలాన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తాజాగా మరో కీలక ప్రకటన చేశారు.

Hyderabad: ఈ ఆఫర్ 31 వరకే.. తరువాత సీన్ వేరే ఉంటుంది.. జాయింట్ సీపీ కీలక వ్యాఖ్యలు..
Special Offer
Follow us on

Hyderabad: ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో ఛలాన్లపై(Traffic Challan) భారీ డిస్కౌంట్లు ప్రకటించిన తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు(Telangana Traffic Police) తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. ముందుగా ప్రకటించినట్లుగా.. ఈ డిస్కౌంట్ ఆఫర్.. మార్చి 1 నుంచి 31 వరకు మాత్రమే ఉంటుందని పునరుద్ఘాటించారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్. మార్చి 31 తరువాత ఆఫర్లు ఉండవని, కేవలం చర్యలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఏవీ రంగనాథ్.. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సామాన్యులపై ఆర్థిక భారం పడుతున్న కారణంగా పెండింగ్ ఛలాన్ డిస్కౌంట్ ప్రకటించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1750 కోట్ల ఛలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించిన ఆయన.. ఈ ఆఫర్ ద్వారా ప్రభుత్వానికి రూ. 300 కోట్లు మాత్రమే ఆదాయం రానుందని చెప్పారు.

ఇప్పటి వరకు రూ. 50 కోట్ల విలువైన చలాన్లు క్లియర్ అయ్యాయని చెప్పారు. మార్చి 31 తరువాత నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇదిలాఉండగా.. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడానికే ఈ ఆఫర్ ప్రకటించారంటూ కొందరు చేస్తున్న ఈ ఆరోపణలను ఏవీ రంగనాథ్ కొట్టిపారేశారు. రెవెన్యూ కోసమే అయితే.. ఈ డిస్కౌంట్ ప్రకటించేవారమే కాదన్నారు. అలాగే.. ఓవర్ స్పీడ్ చలాన్ల విధింపులో మార్పులు చేసే అవకాశం ఉందని చెప్పారు జాయింట్ సీపీ.

Also read:

Bheemla Nayak: ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతున్న భీమ్లానాయక్.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా.?

NIO Kochi jobs 2022: కొచ్చిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు.. అర్హతలివే!

మాట నిలబెట్టుకున్న మంత్రి.. గ్రామస్థుల కళ్లల్లో వెల్లి వెరిసిన ఆనందం.. అసలు విషయం తెలిస్తే మీరూ ఫిదా