Telangana News: మోహన్‌బాబు, అల్లు అర్జున్ ఘటనలపై తెలంగాణ డీజీపీ రియాక్షన్ ఇదే..
నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్‌గా అల్లు అర్జున్‌గా కూడా నిన్న నైట్ ప్రైస్ మీట్ పెట్టి ఆ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు.
తెలంగాణ డీజీపీ జితేందర్ కరీంనగర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. అల్లు అర్జున్‌కు తాము వ్యతిరేకం కాదన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని, సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో చట్ట ప్రకారం మోహన్‌బాబుపై చర్యలు ఉంటాయన్నారు. పౌరులుగా అందరూ బాధ్యాతాయుతంగా ఉండాలని సూచించారు. సినిమాల్లో హీరోలైనా బయట మాత్రం పౌరులే అని చెప్పారు. పోలీసు శాఖ చట్టానికి లోబడి పనిచేస్తుందన్నారు. తప్పు ఎవరు చేసినా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పౌరులకు రక్షణ కల్పించడం తమ ప్రాధాన్యం ఆయన చెప్పుకొచ్చారు.
వీడియో చూడండి:
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి