తెలంగాణలో భారీగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఅర్ (Telangana CM KCR) ప్రకటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఖాళీల భర్తీకి కావలసిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ముందుగా ఆయా శాఖల్లో ఖాళీల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో భర్తీకి సంబంధించి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు కొన్నాళ్లుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) గురువారం ఆర్థిక, సాధారణ పరిపాలన, విద్య, వైద్య, హోం శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు (Meeting). ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు, వాటి పరిస్థితిపై చర్చించారు. తుది సమాచారం, వివరాల ఆధారంగా ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఆయా సంస్థలు నియామక ప్రక్రియను ప్రారంభిస్తాయి.తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని సీఎం పేర్కొన్నారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇకపై రాష్ట్రంలో స్థానిక రిజర్వేషన్లు మాత్రమే అమలవుతాయని వెల్లడించారు.
Also Read
Holi Warning: హొలీ ఆడుతున్నారా.. కళ్ళు, చర్మం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే