Secunderabad Crime News: అయ్యో తల్లీ..! ఎం కష్టం వచ్చిందమ్మా.. కళ్లు కూడా తెరవని కవలలతో నీటమునిగావు..

తెలంగాణ రాష్ట్రంలోని అల్వాల్ దారుణం చోటుచేసుకుంది. ఓ బాలింతరాలు పుట్టి నిండా నెలరోజులైనా నిండని కవల పిల్లలతో నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Secunderabad Crime News: అయ్యో తల్లీ..! ఎం కష్టం వచ్చిందమ్మా.. కళ్లు కూడా తెరవని కవలలతో నీటమునిగావు..
Telangana Crime

Updated on: Feb 20, 2023 | 3:56 PM

తెలంగాణ రాష్ట్రంలోని అల్వాల్ దారుణం చోటుచేసుకుంది. ఓ బాలింతరాలు పుట్టి నిండా నెలరోజులైనా నిండని కవల పిల్లలతో నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ సమీపంలోని ఆల్వాల్‌లోని శివనగర్‌లో సంధ్యారాణి అనే వివాహిత భర్తతో కాపురం ఉంటోంది. ఈ దంపతులకు గతంలో ఓ మగబిడ్డ జన్మించాడు. ఐతే పుట్టిన కొన్ని రోజులకే ఆ బిడ్డ మరణించాడు. ఆ తర్వాత మళ్లీ గర్భందాల్చిన సంధ్యారాణి ఫిబ్రవరి 11న కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో కవలల్లో ఒక బిడ్డకు గత కొన్ని రోజులుగా సుస్తి చేసింది.

తొలి బిడ్డ మాదిరిగానే ఈ కవల పిల్లలు కూడా మరణిస్తారేమోననే భయం సంధ్యారాణిని వేధించసాగింది. పైగా తను మేనరికం చేసుకోవడం వల్ల కవలలు బతకరనే భయంతో ఇంట్లోని సంపులో ఇద్దరు పిల్లలతో కలిసి మునిగి ప్రాణాలు తీసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నెలకూడా నిండని ఇద్దరు పసికందులతో బాలింతరాలు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.