AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. ఇక ప్రైవేటు ట్రావెల్స్‌కి దబిడి దిబిడే..

రోజుకో కొత్త నిర్ణయంతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది తెలంగాణ ఆర్టీసీ. సజ్జనర్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమూల మార్పులను తీసుకొస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం..

TSRTC: తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. ఇక ప్రైవేటు ట్రావెల్స్‌కి దబిడి దిబిడే..
Ts Rtc
Narender Vaitla
|

Updated on: Feb 20, 2023 | 1:47 PM

Share

రోజుకో కొత్త నిర్ణయంతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది తెలంగాణ ఆర్టీసీ. సజ్జనర్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమూల మార్పులను తీసుకొస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. తాజాగా సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రానున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను నడపనున్నారు. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది.

హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో (నమూనా) ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆయన ఆశాభావ్యక్తం చేశారు.

Rtc

ఇవి కూడా చదవండి

బస్సు ప్రత్యేకతలు..

12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్‌ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్‌ వద్ద రీడిండ్‌ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. అంతే కాకుండా బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు. ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కేబిన్‌లో, బస్సు లోపల ఉన్నాయి. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

Telangana

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us