Telangana Corona: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా ఎన్ని కేసులంటే..

Telangana coronavirus:తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తి చెంది రెండేళ్లు కావస్తోంది. ప్రభుత్వం..

Telangana Corona: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా ఎన్ని కేసులంటే..

Updated on: Jan 12, 2022 | 8:10 PM

Telangana coronavirus:తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తి చెంది రెండేళ్లు కావస్తోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ , మరోవైపు కరోనా కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక తాజాగా బుధవారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,319 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,00,094 కాగా, మరణాల సంఖ్య 4,047 ఉంది. ఇక రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,77,708 ఉండగా, తాజాగా 474 మంది రికవరీ అయ్యారు. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 96.80 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 18,339 మంది ఉన్నారు.

అయితే రాష్ట్రంలో కరోనా ఆంక్షలను ఈనెల 20 వ‌ర‌కు పెంచ‌డంతో రోజువారీ కేసుల సంఖ్య కాస్త త‌గ్గే అవ‌కాశం కనిపిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధ‌న‌లు పాటిస్తే కేసుల సంఖ్యను అదుపులో ఉండే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాగా.. దేశంలో థర్డ్‌వేవ్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ పార్టీ నాయకులకు, దేశంలోని ప్రముఖులను తాకింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరిగిపోయింది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) దేశవ్యాప్తంగా 1,94,720 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 442 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

Covid-19: ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు పెంచండి.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ

Lakshadweep: లక్షద్వీప్ మరో ఘనత.. 15-18 ఏళ్ల పిల్లలకు 100 శాతం వ్యాక్సినేషన్..