Telangana Corona Cases Updates: తెలంగాణ ప్రజలకు ఊరటనిచ్చే వార్త. రాష్ట్రంలో రోజు రోజుకు భారీగా నమోదవుతున్న కేసులు సంఖ్య ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 58,742 శాంపిల్స్ సేకరించగా.. వారిలో 5,695 మందికి పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,56,485 మంది కరోనా బారిన పడ్డారు. ఇదిలాఉంటే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3,73,933కి చేరింది. కాగా, ఒక్క రోజులో కరోనా బారిన పడి 49 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా బాధితుల సంఖ్యతో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2,417కి చేరుకుంది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.52శాతం ఉండగా.. రికవరీ రేటు 81.91శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 80,135 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,352 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత అధికంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి పరిధిలో 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వరంగల్ అర్బన్ పరిధిలో 393 కేసులు నమోదు అయ్యాయి. వనపర్తి -101, వికారాబాద్-109, సిద్ధిపేట-238, సంగారెడ్డి-249, రంగారెడ్డి-483, నిజామాబాద్-258, నాగర్‌కర్నూల్-132, మంచిర్యాల-165, మహబూబాబాద్-119, మహబూబ్‌నగర్-221, ఖమ్మం-121, కరీంనగర్-231, జగిత్యాల-190, భద్రాద్రి కొత్తగూడెం-108 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు మాస్క్‌లు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని జాగ్రత్తలు చెబుతున్నారు. అవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.
Also read:
Long COVID Symptoms: కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా ఆ మూడు సమస్యలు తప్పవు.. అధ్యయనంలో తేల్చిన నిపుణులు