టీ కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ కేసులో కీలక పరిణామం.. సీనియర్ నేత మల్లు రవికి కూడా నోటీసులు

|

Jan 09, 2023 | 4:55 PM

టీ కాంగ్రెస్‌ వార్‌ రూం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వార్‌రూమ్‌కి తానే ఇంచార్జ్‌ అని చెప్పుకున్న ఆ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన పోలీసులు ఈనెల 12న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.

టీ కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ కేసులో  కీలక పరిణామం.. సీనియర్ నేత మల్లు రవికి కూడా నోటీసులు
Mallu Ravi
Follow us on

టీ కాంగ్రెస్‌ వార్‌ రూం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వార్‌రూమ్‌కి తానే ఇంచార్జ్‌ అని చెప్పుకున్న ఆ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన పోలీసులు ఈనెల 12న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా తెలంగాణ కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ కేసులో భాగంగా సోమవారం 2గంటa పాటు సునీల్‌ కనుగోలును విచారించారు పోలీసులు. అతని స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. కాగా ఈ కేసుపై స్పందించిన మల్లు రవి టి.కాంగ్రెస్‌ వార్‌రూమ్‌కి తానే ఇంచార్జ్‌ అని చెప్పుకున్నారు. నోటీసులు ఇస్తే తనకు ఇవ్వాలని కానీ, సునీల్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు? ఇందులో భాగంగానే 41 సీఆర్పీసీ కింద విచారణకు హాజరుకావాలని మల్లు రవికి నోటీసులు జారీ చేశారు.  సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించ పరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారని సునీల్‌ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు  దాదాపు రెండు గంటల పాటు విచారించిన పోలీసులు.. సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించిన వివరాలను సునీల్‌ నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. మరోసారి సునీల్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. విచారణ అనంతరం బయటకు వచ్చిన సునీల్‌ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించాడు.

తెలంగాణ గళం పేరుతో ఫేస్‌బుక్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత పై దుష్ప్రచారం చేస్తున్నారనే అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌పై పోలీసులు దాడి చేసి కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. సునీల్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతో ఆయన తెలంగాణ హైకోర్టును గత నెలలోనే ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. సీసీఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఇవాళ సీసీఎస్ ఎదుట విచారణకు హాజరయ్యారు సునీల్‌. వీడియోల మార్ఫింగ్ వ్యవహారంపై స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. గంటకు పైగా విచారణ కొనసాగింది. అయితే మరోసారి విచారణకు పిలుస్తామన్నారు పోలీసులు. అయితే వార్‌రూమ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు సునీల్‌. సునీల్‌ విచారణ ముగిసిన కొద్దిసేపటికే కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ ఇంఛార్జ్ మల్లురవికి నోటీసులిచ్చారు

.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..