AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. పోటీలో నిలిచేది వీరే..

Congress Candidate List: ఆశావహులతో సమావేశాల అనంతరం ఎట్టకేలకు కాంగ్రెస్‌ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 55 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది. కులసమీకరణాలు, గెలుపు అవకాశాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన కాంగ్రెస్‌ తొలిజాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు హర్షం ప్రకటిస్తున్నారు. తొలిజాబితాలో చోటు దక్కని వారు రెండో..

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. పోటీలో నిలిచేది వీరే..
Telangana Congress Mla Candidates
Sanjay Kasula
| Edited By: Shiva Prajapati|

Updated on: Oct 15, 2023 | 10:46 AM

Share

చర్చోపచర్చలు, కులసంఘాలతో భేటీలు. ఆశావహులతో సమావేశాల అనంతరం ఎట్టకేలకు కాంగ్రెస్‌ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 55 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది. కులసమీకరణాలు, గెలుపు అవకాశాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన కాంగ్రెస్‌ తొలిజాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు హర్షం ప్రకటిస్తున్నారు. తొలిజాబితాలో చోటు దక్కని వారు రెండో జాబితా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీపీఐతో పొత్తులపై క్లారిటీ ఇచ్చింది. చెన్నూరు, కొత్తగూడెం అసెంబ్లీ సీట్లు కేటాయిస్తూ ఇప్పటికే సమాచారం ఇచ్చింది.

కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

  1. బెల్లంపల్లి – గడ్డం వినోద్
  2. మంచిర్యాల – ప్రేమ్ సాగర్
  3. నిర్మల్ – శ్రీహరి రావు
  4. ఆర్మూర్ – వినయ్ కుమార్ రెడ్డి
  5. బోధన్ – సుదర్శన్ రెడ్డి
  6. బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల
  7. జగిత్యాల – జీవన్‌రెడ్డి
  8. ధర్మపురి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  9. రామగుండం – రాజ్ ఠాకూర్
  10. మంథని – శ్రీధర్ బాబు
  11. పెద్దపల్లి – విజయ రమణారావు
  12. వేములవాడ – ఆది శ్రీనివాస్
  13. మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ
  14. మెదక్ – మైనంపల్లి రోహిత్
  15. ఆందోల్ – దామోదర రాజనర్సింహ్మ
  16. జహీరాబాద్ – ఏ చంద్రశేఖర్
  17. సంగారెడ్డి – జగ్గారెడ్డి
  18. మేడ్చల్ – తోటకూర వజ్రీస్ యాదవ్
  19. మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు
  20. గజ్వేల్ – నర్సారెడ్డి
  21. కుత్బుల్లాపూర్ – హన్మంత్ రెడ్డి
  22. ఉప్పల్ – పరమేశ్వర్ రెడ్డి
  23. చేవేళ్ల – భీమ్ భరత్
  24. పరిగి – రాంమోహన్ రెడ్డి
  25. వికారాబాద్ – గడ్డప్రసాద్
  26. ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
  27. మలక్ పేట – షేక్ అక్బర్
  28. సనత్ నగర్ – నీలిమా
  29. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
  30. కార్వాన్ – మహ్మమద్ అల్ హజ్రీ
  31. గోషామహల్ – మోగిలి సునీత
  32. చంద్రాయణగుట్ట – బోయ నగేశ్
  33. యాకత్ పుర – రవి రాజు
  34. బహదూర్ పూర్ – రాజేశ్ కుమార్
  35. సికింద్రాబాద్ – సంతోష్ కుమార్
  36. కొడంగల్ – రేవంత్ రెడ్డి
  37. గద్వాల్ – సురితా తిరుపతయ్య
  38. అలంపూర్ – సంపత్ కుమార్
  39. నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
  40. అచ్చంపేట – వంశీకృష్ణ
  41. కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
  42. షాద్ నగర్ – శంకరయ్య
  43. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
  44. నాగార్జున సాగర్ – జయవీర్ రెడ్డి
  45. హుజుర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
  46. కోదాడ – ఉత్తమ్ పద్మావతి రెడ్డి
  47. నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  48. నకిరేకల్ – వేముల వీరేశం
  49. ఆలేరు – బీర్ల ఐలయ్య
  50. ఘన్ పూర్ – సింగాపురం ఇందిరా
  51. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
  52. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
  53. ములుగు – సీతక్క
  54. మధిర – భట్టి విక్రమార్క
  55. భద్రాచలం – పొదెం వీరయ్య

చెన్నూరు(సీపీఐ)

కొత్తగూడెం(సీపీఐ)

ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది. తెలంగాణలో 55 , మధ్యప్రదేశ్‌లో 144, ఛత్తీస్‌గఢ్‌లో 30 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా స్థానం నుంచి మాజీ సీఎం కమల్‌నాథ్‌ బరిలో నిలిచారు.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం