తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీస్ సీజ్ చేశారు సైబర్ క్రైం పోలీసులు. సునీల్ కనుగోలు రన్ చేస్తున్న రెండు ఫేస్ బుక్ అకౌంట్లలో అపొజిషన్ పార్టీపై వ్యతిరేక పోస్టులు పెడుతున్నారన్న ఫిర్యాదులతో ఆఫీస్ సీజ్ చేశారు. మొత్తం ఐదు ఫిర్యాదులు అందాయని.. ఇందులో భాగంగానే మాదాపూర్‌లోని ఆఫీస్‌కు వచ్చామన్నారు పోలీసులు.
పోలీసులు మఫ్టీలో రావడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాత్రిపూట ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేకుండా రావడమేంటని ప్రశ్నించారు. పోలీసుల హడావుడితో మహిళా ఉద్యోగులంతా భయపడి వెళ్లిపోయారని.. ఎఫ్‌ఐఆర్, నోటీసు లేకుండా ఎలా వస్తారని మండిపడ్డారు. పోలీసులు మాత్రం ఫిర్యాదులు అందాయని అంటున్నారు. పోలీసులు చెబుతున్నట్టు ఫిర్యాదులొస్తే.. రాత్రిపూట ఆఫీస్ సీజ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ, పోలీసు చర్యలను నిరసిస్తూ పోలీసులతో నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, అనిల్ యాదవ్.