Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. రైతున్నల కోసం పల్లెబాట యోచన..!

|

May 17, 2022 | 8:21 AM

Telangana Congress: రైతన్నను బతికించుకునేందుకు.. వరంగల్‌ డిక్లరేషన్‌తో పల్లెబాట పట్టాలని డిసైడ్ అయింది టీపీసీసీ. రాహుల్ గాంధీ జోడో భారత్‌ యాత్రను

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. రైతున్నల కోసం పల్లెబాట యోచన..!
Congress Party
Follow us on

Telangana Congress: రైతన్నను బతికించుకునేందుకు.. వరంగల్‌ డిక్లరేషన్‌తో పల్లెబాట పట్టాలని డిసైడ్ అయింది టీపీసీసీ. రాహుల్ గాంధీ జోడో భారత్‌ యాత్రను తెలంగాణ నుంచి ప్రారంభించాలని తీర్మానించిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం.. 30రోజుల రచ్చబండకు సంకల్పించింది. వరంగల్ సభతో జోష్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ అదే ఉత్సాహంతో సోమవారం నాడు విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది.

ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్రకు సిద్దమయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఈ మధ్య నిర్వహించిన చింతన్ శిబిర్‌‌లో కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాహుల్ పాదయాత్ర తెలంగాణ నుంచి ప్రారంభించాలని టీపీసీసీ తీర్మానించింది.

వరంగల్ సభ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించింది టీ కాంగ్రెస్‌. అధికారంలోకి రాగానే రైతులకు 2లక్షల రుణమాఫీ, రైతు కూలీలకు 12వేల ఆర్థిక సాయం, పసుపు బోర్డ్ ఏర్పాటు, ధరణి పోర్టల్ రద్దు, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రైతు డిక్లరేషన్ కరపత్రాలు గడప గడపకు పంచాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మే 21 నుంచి జూన్ 21 వరకు రైతు రచ్చబండ నిర్వహిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మే 6,7న తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్‌ గాంధీ.. ప్రధానంగా వరంగల్ డిక్లరేషన్‌ను రైతుల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ఆ.. ఆదేశాన్ని పక్కాగా అమల్లో పెడుతోంది టీపీసీసీ. పల్లె పల్లెల్లో ప్రతీ గడపను లీడర్ టచ్‌ చేస్తే.. ఆటోమెటిక్‌గా కేడర్‌లో ఉత్సాహం మిన్నంటుతుందని లెక్కలేసుకుంటోంది.