Bharat Bundh: గుర్రపు బండిపై టీ కాంగ్రెస్ నేతల ప్రయాణం.. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వినూత్న నిరసన

భారత్‌ బంద్‌కు మద్దతుగా, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గుర్రపు బండిపై అసెంబ్లీకి రావడం టెన్షన్‌ను క్రియేట్‌ చేసింది.

Bharat Bundh: గుర్రపు బండిపై టీ కాంగ్రెస్ నేతల ప్రయాణం.. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వినూత్న నిరసన
T Congress Protest
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 27, 2021 | 2:27 PM

Telangana Congress – Bharath Bundh: భారత్‌ బంద్‌కు మద్దతుగా, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గుర్రపు బండిపై అసెంబ్లీకి రావడం టెన్షన్‌ను క్రియేట్‌ చేసింది. గాంధీ భవన్‌ నుంచి కాంగ్రెస్‌ సభ్యులు గుర్రపు బండిపై వచ్చారు. వారిని అసెంబ్లీ బయటే ఆపేశారు పోలీసులు. దీంతో అక్కడే రోడ్డుపై బైటాయించారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలోకి కార్లలో మాత్రమే రావాలని ఉందా? గుర్రపు బండిపై రాకూడదని అసెంబ్లీ రూల్స్‌లో ఉందా అని ప్రశ్నించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు.

బీజేపీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు CLP నేత భట్టి విక్రమార్క. హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతున్న శాసనసభ వర్షాకాల సమావేశానికి కాంగ్రెస్ నేతలు గుర్రపు బండ్లపై వెళ్లారు. గాంధీభవన్​నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుర్రపు బండ్లపై వెళ్లి కేంద్ర విధానాలపై నిరసన తెలిపారు.

కేంద్ర, రాష్ట్రంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర నిర్ణయాలు వ్యతిరేకించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన నూతన సాగు చట్టాలపై టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏంటో ఈ అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. కేంద్ర సర్కార్ విధానాలతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని.. సాగును ప్రైవేట్​వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని సీతక్క ఆరోపించారు.

T Congress

T Congress

కాగా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ ఉదయం హైదరాబాద్ సిటీ రోడ్ల మీద గుర్రపు బండ్లపై తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గుర్రపు బండ్లను లోపలికి అనుమతించమని తేల్చిచెప్పారు. అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు నారాయణగూడ పీఎస్​కు తరలించారు. పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా గుర్రపు బండ్లపై అసెంబ్లీకి వెళ్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి.. ప్రజలపై భారం పడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని మండిపడ్డారు.

Read also:  Bharat Bandh Live: దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న భారత్ బంద్, నిలిచిపోయిన రైళ్లు, బస్సులు.. జనజీవనం అస్తవ్యస్థం

జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.