Telangana: పార్టీలో అంతా ఆయనే అనుకున్నారు.. అధిష్టానం నిర్ణయంతో సీన్ రివర్స్..

|

Jan 22, 2023 | 8:27 AM

అంతా ఆయనే అనుకున్నారు. కానీ సీన్‌ మాత్రం మారిపోయింది. తెలంగాణలో రేవంత్‌ పాదయాత్రపై ఎన్నో ప్రచారాలు జరిగినా నేతలంతా యాత్రలో పాల్గొనాలని డిసైడ్‌ చేసింది అధిష్టానం.

Telangana: పార్టీలో అంతా ఆయనే అనుకున్నారు.. అధిష్టానం నిర్ణయంతో సీన్ రివర్స్..
Telangana Congress
Follow us on

అంతా ఆయనే అనుకున్నారు. కానీ సీన్‌ మాత్రం మారిపోయింది. తెలంగాణలో రేవంత్‌ పాదయాత్రపై ఎన్నో ప్రచారాలు జరిగినా నేతలంతా యాత్రలో పాల్గొనాలని డిసైడ్‌ చేసింది అధిష్టానం. ఒక్కరే కాకుండా కలిసికట్టుగా నడవాలని నిర్ణయించింది. ఎన్నికల ఏడాదిలో పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గరవడానికి సీనియర్లు ఫిబ్రవరి 6 నుంచి యాత్ర చేయాలని డిసైడ్‌ చేసింది.

ఈ ఏడాది ఎన్నికల జరుగబోతున్న తెలంగాణలో మరింత బలోపేతం కావడానికి ప్రజల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించింది కాంగ్రెస్‌. రాహుల్‌ జోడో యత్ర ముగుస్తున్న నేపథ్యంలో ఆ యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేసేలా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. పార్టీ కొత్త ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే ఆధ్వర్యంలో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నెల 26వ తేదీన హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ రోజు మండలాలు, డివిజన్‌ స్థాయి నుంచి రాష్ట్ర పార్టీ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి రెండు నెలలపాటు యాత్ర చేయాలని నిర్ణయించారు. ఇన్నాళ్లు రేవంత్‌ ఒక్కరే పాదయాత్ర చేస్తారని ప్రచారం జరిగినా సీనియర్లు సైతం యాత్రలో పాల్గొనేలా నిర్ణయం జరిగింది. ప్రాంతాల వారీగా సీనియర్‌ నేతలు యాత్రలు చేయాలని తీర్మానించారు. ప్రారంభ కార్యక్రమానికి సోనియా లేదంటే ప్రియాంక రావాలని ఆహ్వానిస్తూ తీర్మానం చేశారు.

ఇవి కూడా చదవండి

విస్తృత స్థాయి సమావేశంలో నేతల తీరుపైనా హాట్‌హాట్‌ చర్చ జరిగింది. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దని నేతలకు తేల్చిచెప్పారు ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే. సమస్యలు ఉంటే తనతో చెప్పాలన్నారు. పార్టీకి నష్టం చేస్తే చర్యలు తప్పవని థాక్రే హెచ్చరించినట్లు చెప్పారు రేవంత్‌.

మీటింగ్‌లో కొండా సురేఖ కామెంట్ల ఆసక్తిగా మారాయి. పార్టీకి నష్టం చేసే వారిని సస్పెండ్‌ చేయాల్సిందేనని పట్టుబట్టారామె. వ్యక్తిగత అంశాలను ఈ మీటింగ్‌లో చర్చించొద్దని సూచించారు రేవంత్‌రెడ్డి. బయటకొచ్చాక కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు కొండా సురేఖ.

మొత్తానికి రేవంత్‌ ఒక్కరే పాదయాత్ర చేయాలని కొంతమంది పట్టుబట్టినా అధిష్టానం మాత్రం అందరూ యాత్రలో పాల్గొనే విధంగా ప్లాన్‌ చేయడం కాంగ్రెస్‌లో ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..