Telangana: పేపర్‌ లీక్‌ స్కామ్‌పై గవర్నర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన తమిళిసై..

|

Mar 22, 2023 | 5:45 PM

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ స్కామ్‌లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. బుధవారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన నేతలు.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.

Telangana: పేపర్‌ లీక్‌ స్కామ్‌పై గవర్నర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన తమిళిసై..
Congress Leaders
Follow us on

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ స్కామ్‌లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. బుధవారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన నేతలు.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పారదర్శకంగా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నేతలు. మంత్రి కేటీఆర్, టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌, కార్యదర్శిని విచారించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. సిట్‌ మీద తమకు నమ్మకం లేదని.. విచారణ జరుగుతున్న టైమ్‌లో కమిషన్‌ ఛైర్మన్‌తోపాటు సభ్యులందరినీ సస్పెండ్ చేయాలని గవర్నర్‌ను కోరారు. తామిచ్చిన ఫిర్యాదుపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటానని గవర్నర్ తమిళిసై చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు.

ఇదిలాఉంటే.. కాంగ్రెస్ నేతలతో గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ఘటనను.. కాంగ్రెస్‌ నేతలతో ప్రస్తావించారు. ప్రశ్నాపత్రాల లీకేజ్‌పై అన్నింటినీ పరిశీలిస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటాన్నారు గవర్నర్. తాను రాజ్యాంగ బాధ్యతల్లో ఉన్నానని, దానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని గవర్నర్ తమిళిసై గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..