Telangana: లాకప్‌లో కోడి పుంజు.. ఇంతకీ నేరం ఏంటంటే..?

|

Jul 11, 2023 | 10:20 AM

నేరాలకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసి లాకప్‌లలో పెట్టడం షరా మామూలే. ఐతే జడ్చర్లలోని టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాత్రం ఓ కోడి పుంజును లాకప్‌లో ఉంచారు పోలీసులు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా..

Telangana: లాకప్‌లో కోడి పుంజు.. ఇంతకీ నేరం ఏంటంటే..?
Cock
Follow us on

జడ్చర్ల: నేరాలకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసి లాకప్‌లలో పెట్టడం షరా మామూలే. ఐతే జడ్చర్లలోని టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాత్రం ఓ కోడి పుంజును లాకప్‌లో ఉంచారు పోలీసులు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం వెలుగుచూసింది.

జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి గ్రామ శివారులో రెండు రోజుల కిందట కరివెన గ్రామానికి చెందిన ఓ బాలుడు కోడిపుంజు దొంగతనం చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు వచ్చి బాలుడిని, అతనితోపాటు కోడిపుంజునూ స్టేసన్‌కు తీసుకొచ్చారు. నిందితుడు మైనర్‌ కావడంతో తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇప్పించి పంపించారు.

కోడిపుంజు ఎవరిదో తెలియక పోవడంతో బయట ఉంచితే కుక్కలు దాడి చేసే ప్రమాదం ఉందని పోలీసులు కోడిపుంజునూ లాకప్‌లో ఉంచారు. దానికి గింజలు వేస్తూ పోలీసులు కాపలా కాయటం ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో స్టేషన్‌కు వచ్చిన వారందరూ లాకప్‌లో కోడిపుంజును ఆసక్తిగా చూడటం మొదలుపెట్టారు. జడ్చర్ల పట్టణ సీఐ రమేశ్‌బాబును వివరణ కోరగా.. కోడి పుంజు పోయిందని ఎవరి నుంచి ఫిర్యాదు అందకపోవడంతో దానికి భద్రత కల్పించేందుకే లాకప్‌లో ఉంచినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.