PM Modi – CM Kcr: ప్రధాన మంత్రికి లేఖ రాసిన సీఎం కేసీఆర్.. ఏం కోరారంటే..

|

Mar 29, 2022 | 8:03 PM

PM Modi - CM Kcr: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి లేఖ రాశారు. అయితే, ఈసారి ఉక్రెయిన్‌..

PM Modi - CM Kcr: ప్రధాన మంత్రికి లేఖ రాసిన సీఎం కేసీఆర్.. ఏం కోరారంటే..
Kcr Vs Modi
Follow us on

PM Modi – CM Kcr: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి లేఖ రాశారు. అయితే, ఈసారి ఉక్రెయిన్‌ బాధితులకు న్యాయం కోసం ఆయన ఈ లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడికల్ విద్యార్థులను ఆదుకోవాలని సీఎం కోరారు. ఉక్రెయిన్ నుంచి 20 వేల మంది విద్యార్థులు ఇండియాకు తిరిగి వచ్చారని, వీరిలో దాదాపు అందరూ మెడికల్ విద్యార్థులే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ కారణంగా.. విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఆదుకోవాలని కోరారు. మెడికల్ విద్య కొనసాగింపుపై అనుమతి ఇవ్వాలని కోరారు. దేశంలోని మెడికల్ కాలేజీల్లో సీట్లు కేటాయించాలని లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్. కాగా, బాధితుల్లో 700 మంది తెలంగాణ విద్యార్థులున్నారని, వీరందరి ఖర్చులను రాష్ట్రమే భరిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

Also read:

Telangana Weather Alert: బాబోయ్ ఎండలు.. రాష్ట్రంలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు..!

Telangana Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై అలా చేశారంటే అంతే సంగతలు..!

TSTET 2022: టెట్ అభ్యర్థులూ బీ అలర్ట్.. టెట్‌ వెబ్‌‌సై‌ట్‌లో పాత హాల్‌‌టి‌కెట్లు..