Employees PRC: తెలంగాణ సర్కార్‌ ఉద్యోగులకు తీపి కబురు.. పీఆర్సీపై అధికారిక ప్రకటన చేసే అవకాశం..!

|

Mar 21, 2021 | 1:35 PM

Employees PRC: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైంది. సుమారు రెండు సంవత్సరాలుగా ఉద్యోగులను ఊరిస్తున్న వేతన సవరణ అంశం.

Employees PRC: తెలంగాణ సర్కార్‌ ఉద్యోగులకు తీపి కబురు.. పీఆర్సీపై అధికారిక ప్రకటన చేసే అవకాశం..!
Telangana Cm Kcr
Follow us on

Employees PRC: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైంది. సుమారు రెండు సంవత్సరాలుగా ఉద్యోగులను ఊరిస్తున్న వేతన సవరణ అంశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం కీలక ప్రకటన చేయబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్‌ స్వయంగా తీపి కబురు వినిపించబోతున్నారని విశ్వసనీయ సమాచారం. వేతన సవరణతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఈహెచ్‌ఎస్‌, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ తదితర అంశాలపైనా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ప్రగతి భవన్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశమై పీఆర్సీపై చర్చించారు. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర భృతి కన్నా కనీసం రెండు శాతం ఎక్కువే ఫిట్‌మెంట్‌ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. దీంతో కనీసం 29 నుంచి 33 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం తాజాగా వ్యక్తం అవుతోంది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై సైతం కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఇప్పుడా హామీని నిలబెట్టుకుంటారని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంతో టీఆర్‌ఎస్‌ సంతోషంగా ఉంది. త్వరలో పీఆర్సీపై ప్రకనట చేస్తారని ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ స్థానాలను సైతం గెలుచుకోవడంతో ఇదే జోష్‌కు తోడు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటాని ఉద్యోగులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం సాధారణ ప్రకటన చేస్తుందా..? లేక అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటిస్తారా..? అనేది ఆసక్తి రేపుతోంది. మొత్తం మీద ఉద్యోగులు మాత్రం కేసీఆర్‌ తీపి కబురు ప్రకటిస్తారనే ఆశలో ఉన్నారు.

ఇవీ చదవండి:

Reservations: ఇంకా ఎన్ని తరాలు రిజర్వేషన్లు కొనసాగుతాయి.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు

TRS Party: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం.. రెచ్చిపోయిన టీఆర్ఎస్ నేత.. తెలంగాణ భవన్‌లో ‘గన్‌’తో హల్‌చల్..