CM KCR: రాజ్‌భవన్‌ ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ దూరం.. కనిపించని టీఆర్‌ఎస్‌ నేతలు..

|

Aug 15, 2022 | 8:00 PM

At Home Program:రాజ్‌భవన్‌ ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. చివరి నిమిషంలో కార్యక్రమం మార్చుకున్నారు. అయితే సీఎంతోపాటు టీఆర్‌ఎస్‌ నేతలు కూడా..

CM KCR: రాజ్‌భవన్‌ ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ దూరం.. కనిపించని టీఆర్‌ఎస్‌ నేతలు..
Cm Kcr
Follow us on

తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగే గవర్నర్ తేనీటి విందుకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కనిపించలేదు. అయితే ఈ కార్యక్రమానికి కేవలం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వం తరపున కార్యక్రమానికి హాజరయ్యారు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌. పంద్రాగస్టు సందర్భంగా గవర్నర్, రాజ్‌భవన్‌లో ఆనవాయితీగా నిర్వహించే ఎట్‌హోమ్ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతున్నారని అంతా అనుకున్నారు. 2020 జనవరి 26 గణతంత్రదినోత్సవం రోజున ఒకేఒక్కసారి కేసీఆర్ రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌కి వెళ్లారు. ఆ తర్వాత కరోనా కారణంగా 2021లో ఆగస్ట్ 15న గానీ, జనవరి 26న గానీ ఆనవాయితీ కొనసాగలేదు. 2022 జనవరి 26న ఎట్‌హోమ్‌కి కేసీఆర్ హాజరుకాలేదు. అంతెందుకు ఆ రోజు.. గవర్నర్‌ నిర్వహించిన జెండావందనానికీ కేసీఆర్ హాజరుకాని సంగతి తెలిసిందే.

గవర్నర్‌ రాజ్‌భవన్‌లో ఉగాది సెలబ్రేషన్స్‌కీ ఇద్దరు ఒకరినొకరు కలిసింది లేదు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆనవాయితీగా నిర్వహించే గవర్నర్ ప్రసంగం జరగనేలేదు. అసలు ప్రభుత్వం నుంచి గవర్నర్‌కు ఆహ్వానమే లేదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలకూ గవర్నర్‌ను పిలవలేదు. ఇన్ని రకాల నో ఎంట్రీస్‌ మధ్య.. మొన్నీమధ్యే ఓ ఆసక్తికర ఘట్టం జరిగింది.

తెలంగాణ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా నియమితులైన ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారానికి మాత్రం గవర్నర్‌, కేసీఆర్ ఇద్దరూ ఒకే వేదికపై ఉన్నారు. ఇక మళ్లీ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతున్న కార్యక్రమం ఇది. ఈసారైనా కేసీఆర్ హాజరవుతారాని అంతా అనుకున్నారు.. కానీ అదే సీన్ రిపిట్ అయ్యింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..