Diwali Wishes: తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు

దీపావళి పండగ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పండగ..

Diwali Wishes: తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు
Diwali Wishes

Updated on: Oct 24, 2022 | 11:03 AM

దీపావళి పండగ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో వెలుగులు, సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లుగా వారు తెలిపారు. చెడుపై మంచి సంకేతమని కేసీఆర్‌ అన్నారు. అంధకారాలను తొలగించి ఈ దీపావళికి ప్రతి ఒక్కరికి తెలివి తేటలు ప్రసాధించేలా చేయాలని కోరారు. గత మూడేళ్లుగా దీపావళి పండగను పెద్దగా జరుపుకోలేదని, ఈ ఏడాది దీపావళి పండగ ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

చీకటిపై వెలుగు.. చెడుపై మంచి

ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా తెలుగు ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి.. అజ్ఞానం జ్ఞానం, దృష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా పండగను నిర్వహించుకోవాలని జగన్ కోరారు. దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us