రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్.. ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు గులాబీ బాస్. డిసెంబర్ నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు బహిరంగ సభలతో ఎన్నికల వాతారవరణం క్రియేట్ చెయ్యబోతున్నట్టు తెలుస్తోంది.
డిసెంబర్ మొదటి వారంలో మహబూబ్‌నగర్, జగిత్యాలలో రెండు బహిరంగ సభల్లో పర్యటించబోతున్నారు. అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత మహబూబాబాద్‌లో మరో బహిరంగ సభ నిర్వహించేలా టీఆర్‌ఎస్ రోడ్ మ్యాప్ సిద్దమయింది. డిసెంబర్ 4న ఉమ్మడి పాలమూరులో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే మహబూబాబ్ నగర్ జిల్లా నాయకత్వం ఈ సభ పనుల్లో ఉన్నారు.
ఇక డిసెంబర్ 7న జగిత్యాల జిల్లాలో దాదాపు 2 లక్షల మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు సంబంధించిన బాధ్యతలను ఎమ్మెల్సీ కవితకు అప్పగించినట్టు తెలుస్తోంది. పోడు భూముల సమస్యతో పాటు గిరిజన బంధు పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేసేందుకు కేసీఆర్ ఈ బహిరంగ సభను ఉపయోగించుకునే అవకాశం ఉందని సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..