KCR Maharashtra Tour: గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. ఈ దిశలోనే మరో కీలక అడుగు వేయనున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం ముఖ్యమంత్రి ముంబయికి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో సమావేశం కోసం సీఎం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు.
కేసీఆర్ ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబయికి చేరుకోనున్నారు. ఒంటి గంట సమయంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో అయన నివాసంలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో పాటు, అతని టీం ఉద్దవ్ థాక్రేతో భోజనం చేస్తారు. భోజనం అనంతరం ఎన్సీపీ శరద్ పవార్ నివాసానికి వెళ్లి, అక్కడ జాతీయ రాజకీయ అంశాలపై చర్చిస్తారు. అనంతరం తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు వస్తారు.
ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్ రావు కూడా ముంబయి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇక ముంబయి టూర్ ముగిసిన తర్వాత కేసీఆర్ కర్నాటక వెళ్లనున్నారని సమాచారం. అక్కడ మాజీ ప్రధాని దేవగౌడతో భేటీ కానున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలో మమతా బెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Junio App: చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ పేమెంట్ యాప్.. పేటీఎం మాజీ ఉద్యోగుల వినూత్న ఆలోచన..
AP High Court: ఎమ్మార్వోకు 6 నెలల జైలుశిక్ష, జరిమానా.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు