Telangana Farmers: తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్‌న్యూస్.. ధాన్యం సేకరణపై కీలక నిర్ణయం
Telangana Farmers: తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. ధాన్యం సేకరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని..
Telangana Farmers: తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. ధాన్యం సేకరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. సోమవారం ప్రగతి భవన్‌లో ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని అన్నారు. గత సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 6,545 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, యధావిధిగా ఈ ఏడాది కూడా ఆ కేంద్రాలన్నింటి ద్వారా ధాన్యం సేకరణ జరపాలని సీఎం పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు. మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలుకు కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.