Hima Kohli: సుప్రీం కోర్టు జడ్జిగా తెలంగాణ చీఫ్ జస్టిస్ నియామకం.. ఉత్తర్వులు జారీ..

|

Aug 26, 2021 | 6:25 PM

తెలంగాణ చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని సుప్రీం కోర్టు జడ్జిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని..

Hima Kohli: సుప్రీం కోర్టు జడ్జిగా తెలంగాణ చీఫ్ జస్టిస్ నియామకం.. ఉత్తర్వులు జారీ..
Follow us on

తెలంగాణ చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని సుప్రీం కోర్టు జడ్జిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని సుప్రీం కోర్టు కొలీజియం.. సుప్రీం కోర్టులో బాధ్యతలు స్వీకరించడానికి కొత్తగా తొమ్మిది మంది న్యాయమూర్తుల జాబితాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఇక అందులో ఒకరే తెలంగాణ చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ. ఇదిలా ఉంటే.. సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసిన సందర్భాలు తక్కువ. ఇక ఈసారి కూడా అదే జరిగింది. సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం యధాతధంగా ఆమోదించింది.

కాగా, హిమా కోహ్లీ 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు.1979లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి హిస్టరీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆనర్స్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్‌లో ‘లా’ అధ్యయనం చేశారు. 1984 లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌తో కోహ్లీ లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1999 నుంచి 2004 వరకు ఢిల్లీ హైకోర్టులో న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సెల్‌గా, న్యాయ సలహాదారుగా ఆమె పనిచేశారు. 2006, మే 29న ఆమె ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007, ఆగస్టు 29న పూర్తి స్థాయి న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 2021 జనవరి 7వ తేదీన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇది చదవండి: Viral Video: విసిగిపోయాడు.. పెట్రోల్ పోసి బైక్‌ను తగలబెట్టాడు.. ఎక్కడంటే.!