Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటన
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు బస్సు ప్రమాదంలో మరణించిన మృతులకు మంత్రి వర్గం సంతాపం తెలిపింది.

సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశంలో భాగంగా సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన మృతుల మంత్రి వర్గం సంతాపం తెలిపింది. అలాగే ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. దానితో పాటు మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని నిర్ణయించింది.
ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం.. అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని తెలిపింది. అధికారులతో పాటు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరు చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉండగా ఆదివారం అర్థం రాత్రి 1.30 సమయంలో ఈ ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు.. ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 42 మంది ప్రయాణికులు మరణించినట్టు తెలుస్తోంది. వీరిలో 10 మందివరకు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే మరణించిన వారిలో ఎక్కువ శాతం తెలంగాణకు చెందినవారే ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
