Padi Koushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిని బంపరాఫర్.. ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం

|

Aug 01, 2021 | 10:26 PM

ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్న పాడి కౌశిక్ రెడ్డి బంపారాఫర్ కొట్టేశారు. కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ..

Padi Koushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిని బంపరాఫర్.. ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం
Koushik Reddy
Follow us on

Padi Koushik Reddy: ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్న పాడి కౌశిక్ రెడ్డి బంపారాఫర్ కొట్టేశారు. కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదంకోసం కేబినెట్ సిఫారసు చేసింది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కౌశిక్ రెడ్డిని పదవి వరించినట్టు కనిపిస్తోంది.

ఇలా ఉండగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యద‌ర్శి పైడి కౌశిక్ రెడ్డి గతనెల 21వ తేదీన టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌ తీర్థం తీసుకున్నారు.

హైదరాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్యక్రమంలో కౌశిక్‌రెడ్డికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. కౌశిక్‌రెడ్డి వెంట వ‌చ్చిన అనుచ‌రుల‌ను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

“తెలంగాణ సాధన కోసం చాలా మంది పనిచేసారు.. 1969 ఉద్యమంలో 400 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చెన్నారెడ్డి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోయినా ఉద్యమాన్ని నడిపారు. కానీ అప్పటి పాలకులు తెలంగాణ ఏర్పాటు చేయలేకపోయారు. రాజకీయాలు జరుగుతుంటాయి.. గెలుపు ఓటములు నిరంతర ప్రక్రియ. తెలంగాణ రాష్ట్రం చాలా కష్టపడి సాధించిన రాష్ట్రం. ఇది రాచరిక వ్యవస్థ కాదు..ఎప్పుడు ఒకరే అధికారంలో ఉండరు. కానీ మన కంట్రిబ్యూషన్ ఉంటది.” అని కేసీఆర్ ఆ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also:  Software Baba: సాఫ్ట్‌వేర్‌ జాబ్‌కి పేకప్ చెప్పి.. స్వామీజీగా స్టార్టప్ ఆశ్రమం. అసాంఘీక కలాపాలు, భక్త జనానికి బోడిగుండ్లు