GO 111 Cancelled: ఇక, హైదరాబాద్ శివారు భూములు బంగారమే.. జీవో 111 ఎత్తివేస్తూ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం

|

Apr 12, 2022 | 6:46 PM

తెలంగాణలో 111 జీవోను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కేబినెట్ భేటీలో మంత్రులతో చర్చించిన ఆయన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

GO 111 Cancelled: ఇక, హైదరాబాద్ శివారు భూములు బంగారమే.. జీవో 111 ఎత్తివేస్తూ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం
Kcr
Follow us on

G.O.111 cancelation: జీవో 111.. ఈపేరు విన్నప్పుడల్లా ఏపీ, తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో అలజడి మొదలవుతుంది. లక్ష 32 వేల ఎకరాల జమీన్ కహానీ ఈ త్రిబుల్ వన్ జీవో. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్దమనుషుల పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్. ఒక్కసారి జీవో ఎత్తేస్తే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కొత్త కొత్త రికార్డులనే సృష్టిస్తుంది. రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District)లో 1,32,000 ఎకరాల్లో విస్తరించి ఉంది GO.111. హైదరాబాద్(Hyderabad) మహానగర శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్​ మండలాలు పూర్తిగా.. వికారాబాద్ జిల్లాలోని శంకర్​పల్లి, చేవెళ్ల, షాద్​నగర్​, షాబాద్​ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు త్రిబుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. బ

హైదరాబాద్ పట్టణానికి తాగు నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక త్రిబుల్ వన్ GO ఎత్తి వేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. దీంతో త్రిబుల్ వన్ జీరో పరిధిలో లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్నాపెద్ద అంతా త్రిబుల్ వన్ జీవోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వెంచర్లు అక్రమ నిర్మాణాలతో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ భారీగా జరుగుతుంది. త్రిబుల్ వన్ జీవో ఎత్తివేయాలంటూ చాలామంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు జీవో ఎత్తివేసే దిశగా వస్తుందని అందరూ భావిస్తున్నారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎత్తివేయాలని చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రంగారెడ్డి ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. హైకోర్టు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు అడగడంతో.. సీఎం కేసీఆర్ త్రిబుల్ వన్ జీవోపై సమీక్ష జరిపారు. అంతేకాకుండా జీవో పరిధిలోని జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర వాతావరణ సమతుల్యతను పెంచేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు.

ఇప్పటికీ ఇక్కడ వందల సంఖ్యలో ఫామ్‌హౌజ్‌లు నిర్మించారు. విల్లాలు నిర్మించారు. భూ క్రయ విక్రయాలకు సంబంధించి భారీ ఎత్తున లావాదేవీలలో జరిగిన త్రిబుల్ వన్ లో ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే టెన్షన్ నెలకొంది. ఈనేపథ్యంలో కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. 111 జీవో పరిధిలో 1,32,600 ఏకరాల భూమి ఉందని, గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవో ఇచ్చామన్నారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ జలాశయాల నీరు అవసరం లేదని, ఇంకో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్ కు నీటి కొరత ఉండదుని అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అన్న కేసీఆర్‌. ఒక నిపుణులు కమిటీ వేశారు. ఎక్స్‌పర్ట్స్ కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తాం అంటూ సీఎం ప్రకటించారు. ఈనేపథ్యంలో మంగళవారం సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి జీవో 111ను ఎత్తివేసేందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో 111జీవో పరిధిలో ఉన్న భూములు ఇక బంగారం కానున్నాయి..