ఈనెల 9 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి.     9 వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. 9 వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్, మండలిలో ఆయన తరపు వేరొక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.  గత బడ్జెట్ సమావేశాల్లో ఆరునెలల కాలానికి ఓటాన్ ఎక్కౌంట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనున్నారు. 9న తొలిరోజున శాసనసభలో సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగం […]

ఈనెల 9 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2019 | 7:23 PM

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి.     9 వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. 9 వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్, మండలిలో ఆయన తరపు వేరొక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.  గత బడ్జెట్ సమావేశాల్లో ఆరునెలల కాలానికి ఓటాన్ ఎక్కౌంట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనున్నారు.

9న తొలిరోజున శాసనసభలో సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగం చేయనున్నారు. కాగా ఈ దఫా బడ్జెట్ సమావేశాలు వాడిగా, వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్తు కొనుగోళ్ళ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై తారస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

బడ్జెట్ రూపకల్పన సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఇటీవల సీఎం కేసీఆర్ ముఖ్య అధికారులతో చర్చించిన విషయం తెలిసిందే. ఖర్చులు తగ్గించుకుని ఆదాయ మార్గాలను అన్వేషించాలని కూడా అధికారులకు కేసీఆర్ సూచించారు.