తెలంగాణలో ఎన్నికల బడ్జెట్ రాబోతోంది. నవంబర్-డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శాఖలకు నిధులు కేటాయింపులు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్తగా ప్రజాకర్షక స్కీమ్‌లు కూడా తేనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయింపులు, వనరుల నిర్వహణపై సీఎం కేసీఆర్ హై లెవల్ సమీక్ష చేశారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రిపరేషన్స్‌పై సీఎం కేసీఆర్ హై లెవల్ సమీక్ష చేశారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌తో పాటు.. ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. ఫిబ్రవరి 3 లేదా 5 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎంత మేరకు నిధులు వస్తాయి? ఏ ఏ శాఖలకు కేటాయింపులు ఉంటాయి? అన్న అంశాలపై క్లారిటీ వస్త్తుంది. ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు పంపాలంటూ అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి.
2022-23లో ప్రభుత్వ వ్యయం ఇప్పటికే 2 లక్షల కోట్లు దాటినట్టు అంచనా. ఇంకా రెండు నెలలు మిగిలి ఉండడంతో.. బడ్జెట్ 2.10 లక్షల కోట్ల నుంచి 2.15 లక్షల కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. రాష్ట్ర సొంత ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించినట్టు సమాచారం. రాష్ట్ర సొంత ఆదాయం 19 నుంచి 20 శాతం వృద్ధి నమోదు చేసినట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..